ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలంలోని బూసాయవలసకు వెళ్లే జాయతీ య రహదారిపై పెంట్రోల్ బంకు సమీపంలో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం కొట్టక్కి గ్రామంలోని ఎరుకులవాడకు చెందిన పాలవలస సత్యనారా యణ(60) కూలి పనికోసమని మంగళవారం ఉద యం కుటుంబసభ్యులకు చెప్పి బయలుదేరి వెళ్లాడు. పని ముగించుకుని రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. వెంటనే స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం 108 వాహనంలో బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.మృతుడి అన్న కొడుకు పాలవలస రమణ ఫిర్యాదు మేరకు ఏఎస్సై అప్పారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


