పౌష్టికాహారం సకాలంలో అందజేయాలి
విజయనగరం ఫోర్ట్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సరైన మోతాదులో సకాలంలో అందజేయాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో బుధవారం సాయంత్రం ఐసీడీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అవసరాన్ని బట్టి 200 మిల్లీలీటర్లు, 500 మి.లీ, ఒక లీటరు పరిమాణాల్లో సరఫరా చేయాలని తెలిపారు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సరుకులు అందేలా చూడాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి. విమలారాణి, సివిల్ సప్‌లైస్ డీఎం బి.శాంతి, డీఎస్‌ఓ జి. మురళీనాథ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి పాల్గొన్నారు.
జేసీ సేతు మాధవన్


