జాతర నాటికి నిర్మాణం పూర్తిచేస్తాం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ పనులు పైడితల్లి సిరిమాను జాతర నాటికి పూర్తిచేస్తామని దేవదాయశాఖ రాష్ట్ర కమిషనర్ కె.రామచంద్రమోహన్ అన్నారు. అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను మంగళవారం స్వీయపర్యవేక్షణ చేశారు. బాలాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చుట్టుపక్కల సేకరించిన స్థలాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా నిర్మాణాలు చేయాలన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సహాయ కమిషనర్, పైడితల్లి ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష, ఉపకార్యనిర్వహక ఇంజినీరు కేవీసీ కృష్ణ, సహాయ ఇంజినీరు సాయికృష్ణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


