ఆస్పత్రి భవనాలు, మ్యూజియం ప్రారంభం
● నిర్మాణాలకు పాలగెడ్డ–నూలు గెడ్డలోని సాగునీరు చౌర్యం ● రూ.1000 నుంచి రూ.1500 పలుకుతున్న ట్యాంకర్ ్చ ● చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు
సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రి అదనపు భవనాలను, గిరిజన మ్యూజియాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి జి.సంధ్యారాణి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌లు మంగళవారం ప్రారంభించారు. వైద్యసేవలతో పాటు రోగులకు తోడుగా ఉండేందుకు కలెక్టర్ ప్రవేశపెట్టిన హెల్పింగ్ హ్యాండ్స్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. వచ్చేనెలలో సాలూరులో నూతన ఆస్పత్రిని ప్రారంభించనున్నామన్నారు. అనంతరం అడ్వెంచర్ పార్కులోని జలవిహార్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదిలారు. కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పి.భూదేవి, ఏఎంసీ చైర్మన్ సంధ్యారాణి, టీడీపీ నాయకురాలు తేజోవతి, ముఖలింగం, పవన్, ప్రసాద్, ఏపీఓ చిన్నబాబు, డీఎంహెచ్‌వో భాస్కరరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త నాగభూషణరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆహ్వానమిచ్చి అవమానం
స్థానిక ఏరియా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానించి అవమానించారని ఎంపీపీ బి.ఆదినారాయణ ఆరోపించారు. ఆస్పత్రి భవనాలను ప్రారంభిస్తున్న సమయంలో తాము వచ్చినప్పటికీ పిలవలేదన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రూ.19.07 కోట్ల నిధులు వెచ్చించి ఆస్పత్రి నిర్మాణం చేపట్టారని, 80 శాతం వరకు పనులు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నాటి ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిల చొరవతో పూర్తయ్యాయన్నారు. గిరిజన వైద్యానికి పెద్దపీటకు బీజం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే పడిందన్నారు. దీనిలో భాగంగా ఏరియా ఆస్పత్రికి అదనపు భవనాలు, 30 నుంచి వంద పడకల ఆస్పత్రిగా మార్పు జరిగిందని గుర్తు చేశారు. సీతంపేటలో రూ.50 కోట్లతో కార్పొరేట్ తరహాలో సూపర్ మల్టీస్ఫెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. 70 శాతం వరకు ఆ పనులు కూడా పూర్తయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పూర్తిస్థాయిలో పనులు చేయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఫీవర్ సర్వే డోర్‌టూ డోర్ జరిగేదని, సురక్ష పేరుతో గ్రామాలకు వెళ్లి అందరికీ వైద్యసేవలు అందించేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోయారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు చంద్రశేఖర్, గణేష్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్.రాము, రంగారావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
జలగల్లా తోడేస్తున్నారు..!
ఆస్పత్రి భవనాలు, మ్యూజియం ప్రారంభం


