హైకోర్టు న్యాయమూర్తితో ఎస్పీ భేటీ
పార్వతీపురం రూరల్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్ రాయ్ ను ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో ఉన్న న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి యజేసి, పూలమొక్కను అందజేశారు.
పార్వతీపురంటౌన్: విశ్రాంత ఉద్యోగులు తమ పింఛన్‌కు సంబంధించి లైఫ్ సర్టిఫికెట్లను జిల్లా కేంద్రంలో గల పింఛన్ దారుల భవనంలో చేసుకునే విధంగా అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వ పింఛన్ దారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గంటా జగన్నాథం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికెట్లకు సంబంధించి వార్షిక వెర్ఫికేషన్ సర్టిఫికెట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు ప్రతి వర్కింగ్ డేలోను ఈ కార్యక్ర మం ఉంటుందని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పార్వతీపురం రూరల్: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ఉపాధ్యాయుల ఐక్యతే మార్గంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పార్వతీపురం మన్యం జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా కొలువుదీరింది. స్థానిక ప్రభుత్వ పింఛన్‌దారుల భవనంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈవీ రామారావు పర్యవేక్షణలో సోమవారం జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశం ఎన్నికల వేదికై ంది. జిల్లా అధ్యక్షుడిగా మర్రావు మహేష్, ప్రధాన కార్యదర్శిగా నల్లా బాలకృష్ణారావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికై సారథ్య బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యక్షులు గా రావాడ అప్పలనాయుడు, కె. పద్మజ, జి.సత్యనారాయణ, డి.అప్పలనాయుడు, మరడాన సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరించగా.. కార్యదర్శులుగా ఎంవీ గౌరీశంకర్, బీవీఏ నా యుడు, ఎ.జగదీశ్వరరావు, జి. శ్రీనివాసరావు, జి.సూర్యనారాయణలను సభ ఎన్నుకుంది. రాష్ట్ర కౌన్సిలర్‌గా బీవీ రమణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయ హక్కుల రక్షణే శ్వాసగా, సంఘం బలోపేతమే ధ్యాసగా పనిచేస్తామని ప్రతినబూనారు. త్వరలోనే జిల్లా సబ్ కమిటీల ను నియమిస్తామని ప్రధాన కార్యదర్శి తెలిపా రు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాల ప్రతినిధులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మేనత్త పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవాన్ని సోమవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. చదురుగుడిలో పోలమాంబ అమ్మవారి సన్నిధిలో ఈవో బి. శ్రీనివాస్, ట్రస్ట్‌భోర్డు చైర్మన్ నైదాన తిరుపతి రావు, కమిటీ సభ్యులు, మాజీట్రస్ట్‌బోర్డు చైర్మ న్లు, గ్రామపెద్దలు, కుప్పిలి, కరణం, రెవిన్నాయుడు, జన్నివారి కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు పెదపోలమాంబ అమ్మవారి ఘటాల కు వెండిపూతను పట్టించి అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని, అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఘటాలకు గ్రామంలో తిరువీధి నిర్వహించారు. మంగళవారం పెదపోలమాంబ అమ్మవారి ప్రధాన ఉత్సవం నిర్వహిస్తారు.
హైకోర్టు న్యాయమూర్తితో ఎస్పీ భేటీ


