గుర్తు తెలియని వృద్ధుడు మృతి
రాజాం సిటీ: స్థానిక వైఎస్సార్ పార్కు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. వైఎస్సార్ పార్కు ఏరియా, శ్రీనివాస థియేటర్ రోడ్డుల్లో గుర్తు తెలియని వృద్ధుడు యాచిస్తూ సంచరిస్తుండేవాడు. మంగళవారం వైఎస్సార్ పార్కు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వృద్దుడుని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. వృద్ధుని గుర్తించిన వారి బంధువులు పోలీసులను సంప్రదించాలని తెలిపారు.


