అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు జీఎంఆర్ విద్యార్థులు
రాజాం సిటీ: చైన్నె ఎస్‌ఆర్‌ఎం ఐటీ డీమ్డ్‌టుబీ యూనివర్సిటీలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల బాస్కెట్‌బాల్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ బీహెచ్ అరుణ్‌కుమార్ మంగళవారం తెలిపారు. ఇటీవల రఘు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో కళాశాలకు చెందిన ఎం.కార్తీక్, కె.శ్రీనివాస్ జేఎన్‌టీయూ జీవీ తరఫున ఆడారని తెలిపారు. విద్యార్థుల ఎంపికపట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, అధ్యాపకులు అభినందించారు.
అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు జీఎంఆర్ విద్యార్థులు


