
జిల్లాకు రెగ్యులర్ డీఈఓను నియమించేది ఎప్పుడు?
పార్వతీపురం: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో వరుసగా మూడుసార్లు ప్రథమ స్థానంలో నిలిచిన పార్వతీపురం మన్యం జిల్లాకు రెగ్యులర్ జిల్లా విద్యాశాఖాధికారిని నియమించుకోలేని నిస్సహాయస్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యమని గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధానకార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ విమర్శించారు. స్థానిక విలేకరులతో ఆయన సోమవారం మాట్లాడుతూ డీఈఓగా ఒక ఎంఈఓకు అదనపు బాధ్యతలను అప్పగించారని, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా ఏటీడబ్ల్యూఓకు బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు రెగ్యుల ర్ పీఓలను నియమించాలని కోరారు.
పాలకొండ రూరల్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానంలోని హుండీల ఆదాయాన్ని దేవదాయ ధర్మాదాయశాఖ అధికారులు సోమవారం లెక్కించారు. మే నెల 31వ తేదీ నుంచి నేటి వరకు హుండీల నుంచి రూ.10,80,781లు ఆదాయం వచ్చినట్టు దేవదాయశాఖ తనిఖీ అధికారి ఎస్.రామారావు ఈఓ సూర్యనారాయణ తెలిపారు.