
మట్టి గణపతి ప్రతిమలనే పూజిద్దాం
పార్వతీపురం రూరల్: వినాయక చవితి సంద ర్భంగా మట్టి ప్రతిమలను పూజించి పర్యావర ణ పరిరక్షణ కోసం పాటుపడాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపుని చ్చారు. మట్టితో తయారుచేసిన గణపతి ప్రతిమలను కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం పంపిణీ చేశారు. గణపతి నవరాత్రుల నేపథ్యంలో ఎక్కడా డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శబ్ధ కాలుష్యం లేకుండా మైక్ సెట్‌లను ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. మట్టి వినాయక ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలను కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ చేతుల మీదుగా జేసీ శోభిక, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మన్మథరావు, డీఎంహెచ్‌ఓ భాస్కరరావు అందుకున్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్వో కె.హేమలత, ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎన్.సుధారాణి, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 105 మీటర్లుకాగా, సోమవారం సాయంత్రం నాటికి 104.2 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రస్తు తం ప్రాజెక్టులో 3,622 క్యూసెక్కుల నీరు చేరు తుండగా ఒక గేటును ఎత్తివేసి 3,321 క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నట్టు ఏఈ కిశోర్ తెలిపారు.
సీతానగరం: మండలంలోని సహకార సంఘా ల బలోపేతమే లక్ష్యంగా చైర్మన్‌లు పనిచేయా లని డీసీసీబీ నోడల్ అధికారి కె.జానకి కోరా రు. సీతానగరం డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్‌లు, సీఈఓలతో బ్రాంచి చీఫ్‌మేనేజర్ జి.సూర్యనారాయణ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు అవసరమైన రుణాల మంజూరుతో పాటు రెన్యువల్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో అంటిపేట, గుచ్చిమి, తామరఖండి, గెడ్డలుప్పి, సీతానగ రం, ఆర్.వెంకంపేట, అజ్జాడ, బూర్జ పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: గిరిజన అధ్యయనాలు, విస్తృత పరిశోధనలు, గ్రంథాలు భద్రపరచడం అంశాలపై విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి మరో నాలుగు కేంద్ర విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వర్సిటీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై ఆయా వర్సిటీల ప్రతినిధులు సంతకాలు చేసినట్టు ఇన్‌చార్జి వీసీ టి.శ్రీనివాసన్ తెలిపారు. ఒడిశాలోని కేంద్ర విశ్వవిద్యాలయం, అమరకంటక్‌లోని ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, తెలంగాణలోని సమక్క సరక్క గిరిజన యూనివర్సిటీలు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. కార్యక్రమంలో వర్సిటీల ప్రతినిధులు ఎన్.నాగరాజు, సౌభాగ్యరంజన్ పాడి, వై.ఎల్.శ్రీనివాస్, నరసింహ చరణ్ పాండా తదితరులు పాల్గొన్నారు.

మట్టి గణపతి ప్రతిమలనే పూజిద్దాం

మట్టి గణపతి ప్రతిమలనే పూజిద్దాం