
పూడికలు తొలగించిన రైతన్నలు
పట్టించుకోని
పాలకులు..
కురుపాం: కూటమి పాలకుల పాలనా వైఫల్యం, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వెరసి గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. ఒకప్పుడు సస్యశ్యామలంగా పండిన పంట భూములు సాగునీరు అందక బీడు భూములుగా తయారైనా అధికార యంత్రాంగంలో స్పందన కరువైంది. పూడికలు తొలగించి, 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా చూడాలని పాలకులు, అధికారులకు విన్నవించినా స్పందన కరువైంది. ఖరీఫ్ ఉభాల సమయం దాటిపోతుండడంతో ఆవేదన చెందారు. గోళ్లవలస, కర్లగండ, కుంబుకోట, పాలెం, గుజ్జుపాడు, ఈదలవలస, చెక్కవలస, వన్నాం, సీతంపేట, పూతికవలస గ్రామాల రైతులు చందాలు పోగుచేసి జేసీబీ సాయంతో కాలువల్లో పూడికలు తొలగింపునకు శనివారం నడుంబిగించారు. రైతుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని, పెట్టుబడి సాయం నుంచి విత్తనాలు, ఎరువులు, కాలువల్లో పూడికల తొలగింపు, పంటకు మద్దతు ధర కల్పన ఇలా అన్నింటిలోనూ రైతన్నకు ఆవేదన మిగుల్చుతోందని వాపోయారు.
గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు ఆయకట్టు పరిధిలోని 15 గ్రామాల రైతులకు చెందిన భూములు ఉన్నాయి. కాలువలు పూడుకుపోవడంతో సాగునీరు అందని పరిస్థితి. ఎన్నిసార్లు ఇరిగేషన్ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. పాలకులూ పట్టించుకోలేదు. రైతులందరూ కలిసి చందాల రూపంలో రూ.50వేలు పోగుచేసి జేసీబీతో ప్రధాన కాలువల్లోని పూడికల తొలగింపు పనులు చేపట్టాం. ప్రజా ప్రతినిధులు స్పందించి గుమ్మిడిగెడ్డ అక్విడెక్టును అభివృద్ధి చేయాలి.
– శెట్టి సురేష్, గుమ్మిడిగూడ సర్పంచ్
గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు ప్రధాన కాలువలో పేరుకుపోయిన పూడికలు
తొలగింపునకు చర్యలు తీసుకోని ప్రభుత్వం
350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకం
రైతులే చందాలు పోగుచేసి పూడికల తొలగింపునకు చర్యలు

పూడికలు తొలగించిన రైతన్నలు

పూడికలు తొలగించిన రైతన్నలు