
స్ఫూర్తి ప్రదాత.. టంగుటూరి
● ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి ప్రదాత అని, ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి అన్నారు. టంగుటూరి జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయవాదిగా, రాజకీయ వేత్తగా, రచయితగా, సంపాదకీయుడిగా, రాజనీతిజ్ఞునిగా ప్రకాశం పంతులు విశేషంగా రాణించారని ఎస్పీ కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు రంగనాథం, ఆదాం, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో...
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో ఆంగ్లేయులకు ఎదురు నిలిచి గుండె చూపిన ధైర్యశీలి టంగుటూరని ఆమె అన్నారు.

స్ఫూర్తి ప్రదాత.. టంగుటూరి