
ఎరువు కోసం గిరిజన రైతుల ఆందోళన
జియ్యమ్మవలస రూరల్: ఎరువు దొరకక గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. అలమండ పంచాయతీలో నిడగళ్లుగూడ, చినతోలుమండ, చినతోలుమండ గూడ, రామభద్రపురం, ఎస్సీ మరువాడ, ఎసీ్‌ట్ మరువాడ, నీలకంఠాపురం తదితర తొమ్మిది గ్రామాలకు చెందిన 600 మంది రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నా పట్టించుకునేవారే లేరని వాపోయారు. ప్రస్తుతం 222 బస్తాల యూరియా వచ్చిందని, ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇచ్చినా మరో 400 బస్తాల ఎరువు అవసరమని, పూర్తిస్థాయిలో ఎప్పుడు సరఫరా చేస్తారని కూటమి సర్పంచ్ చంటి అధికారులను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రైతుపై చిన్నచూపు చేస్తోందని, విత్తనాలు, ఎరువులు అందించడంలో విఫలమైందటూ రైతులు నగేష్, అన్నపూర్ణ తదితరులు ఆరోపించారు.