
ఆర్‌ఎంపీ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: పురుగుల మందు తాగి ఆర్‌ఎంపీ వైద్యుడు నరసింహరావు(48) ఆత్మహత్య చేసుకున్నట్టు వన్ టౌన్ పోలీసులు శనివారం తెలిపారు. దీనికి సంబంధించి ఏఎస్‌ఐ జగన్మోహనరావు తెలిపిన వివరాలు.. భోగాపురంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పని చేస్తున్న నరసింహరావు రెండు రోజుల కిందట భార్య జ్యోతికి విజయనగరంలో పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. నరసింహరావు నగరంలోని సంగీత కళాశాల వద్ద ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద పడి ఉండడాన్ని శనివారం గుర్తించిన స్థానికులు ఫోన్ నంబరు ఆధారంగా భార్యకు సమాచారం అందించారు. వెంటనే భోగాపురం నుంచి వచ్చిన జ్యోతి అపస్మారక స్థితిలో ఉన్న భర్తను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించింది. కాగా, శనివారం మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వన్ టౌన్ పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేశారు.