
అత్తా,కోడళ్ల ఘర్షణలో అత్త మృతి
జామి: అత్తా,కోడళ్ల మధ్య తలెత్తిన స్వల్ప వివాదం ఘర్షణకు దారి తీయడంతో కోడలు తోసివేయడంతో అత్త మృతిచెందింది. ఈ ఘటనపై సీఐ ఎల్.అప్పలనాయుడు, మృతురాలి కుమారుడు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జేడీ వలస గ్రామానికి చెందిన గూనురు అప్పల కొండకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు అప్పారావు, కోడలు రాజమండ్రిలో ఉండేవారు. అప్పారావు అనారోగ్యంతో మృతిచెందడంతో భార్య లక్ష్మి అత్తవారిల్లు అయిన జేడీ వలస గ్రామానికి వచ్చి ఉంటోంది. ఇటీవల కొద్దిరోజుల క్రితం పుట్టినిల్లు డెంకాడ వెళ్లి బుధవారం మళ్లీ జేడీ వలస వచ్చింది. వచ్చిన కొంత సమయం తరువాత అత్త గూనురు అప్పలకొండ (72), కోడలు లక్ష్మి మధ్య వివాదం తలెత్తడంతోఘర్షణ పడ్డారు.ఈ ఘర్షణలో అత్తను లక్ష్మి చేతితో తోసివేయడంతో మంచం మీదనుంచి కిందకు పడిపోయి స్తృహ కోల్పోగా కుటుంబసభ్యులు జామి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తిరిగి మృతదేహన్ని జేడీ వలస గ్రామానికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై మృతురాలి రెండవ కుమారుడు రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్సై వీర జనార్దన్ ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్ధాయిలో విచారణ చేపడతామని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎస్.కోట సామాజిక ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
గజపతినగరం రూరల్: మండలంలోని పిడిశీల గ్రామానికి చెందిన కర్రోతు సాయిసుధ మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గజపతినగరం ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీర కట్టుకుని ఉరివేసుకున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపేదని భర్త, పిల్లలతో సరదాగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఇంత పనిచేస్తుందని అనుకోలేదని స్థానికుల సమాచారం మేరకు తెలిసిందన్నారు. మృతురాలి తల్లి పిల్ల వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానా స్పద మృతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం అనందరం వచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నామన్నారు.
రాజాంలో శతాధిక వృద్ధురాలు..
రాజాం సిటీ: పట్టణ పరిధి బుక్కా వీధికి చెందిన శతాధిక వృద్ధురాలు మండా గున్నరాజమ్మ(105) మంగళవారం రాత్రి మృతిచెందారు. ఆమె నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆహారం కూడా తీసుకునేదని కుటుంబసభ్యులు తెలిపారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కోడళ్లు, ఇద్దరు మనుమలు, ఐదుగురు మునిమనుమలు ఉన్నారు.

అత్తా,కోడళ్ల ఘర్షణలో అత్త మృతి

అత్తా,కోడళ్ల ఘర్షణలో అత్త మృతి