
వేతన వెతలు..!
న్యూస్‌రీల్
గ్రీన్ అంబాసిడర్ల అవస్థలు జీతాలు ఎప్పుడు చెల్లిస్తారు బాబూ... పది నెలలుగా జీతాలు చెల్లించని కూటమి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా కష్టాల్లో 943 మంది కార్మికుల కుటుంబాలు
ప్రభుత్వం తీరు సరికాదు
కార్యదర్శులను ఆదేశించాం
–10లో
వణికిస్తున్న వైరల్ జ్వరాలు
పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రస్తుత సీజన్‌లో
కురుస్తున్న వర్షాల ప్రభావంతో దోమలు
విజృంభిస్తున్నాయి.
శుక్రవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పార్వతీపురం రూరల్:
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు నిర్వహించే గ్రీన్ అంబాసిడర్లను కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుధ్య పనులు నిర్వహించే వీరికి సకాలంలో జీతాలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తూ వారి కుటుంబాల పోషణ కష్టంగా మారింది. పంచాయతీల నిధుల నుంచి వీరికి జీతా లు చెల్లించాల్సి ఉండగా... ఆ పంచాయతీల్లో నిధుల్లేక వీరి వేతనాలు చెల్లింపులు జరగడం లేదు. పంచాయతీలకు ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మొట్టమొదటిసారిగా ఈ గ్రీన్ అంబాసిడర్లతోనే పరిశుభ్రత చర్యలు చేపడుతున్నారు. అటువంటి వీరికి సుమారు పది నెలలుగా జీతాలు చెల్లించాల్సి ఉన్నా.. ఆ ఊసే కూటమి నేతలు ఎత్తడం లేదు. వీరికి నెలకు రూ.ఆరు వేలు వేతనంగా ఉంది. పది నెలలుగా జీతాలు చెల్లించకుండా పనులు చేయించుకుంటోంది. ఇదెక్కడి న్యాయం అంటూ స్థానిక పాలకులను, అధికారులను ఆశ్రయించినా రాజకీయ కక్షలతో వేధింపులకు గురి చేస్తూ వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో చేసేది ఏమీ లేక నమ్ముకున్న ఉపాధిని వదుకోలేక సకాలంలో జీతాలు రాకపోయినా పనులు కొనసాగిస్తున్నారు. కూట మి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర పేరిట ఏ కార్యక్రమం చేపట్టి నా వాటికి పునాదిగా నిలబడేది ఈ గ్రామీ ణ పారిశుధ్య కార్మికులే. ఇటువంటి చిరు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడంపై గ్రామీణ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొద్దిపాటి మొత్తం చెల్లింపులో ఇంత తాత్సారం చేస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సకాలంలో జీతాలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో జిల్లాలో ఇప్పటికే అక్కడక్కడా అసంతృప్తితో కొంతమంది గ్రీన్ అంబాసిడర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో చెత్తకుప్పల నిల్వలు ఎక్కడికక్కడ దర్శనమిస్తూ పారిశుధ్య లోపాన్ని ఎత్తిచూపే విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీలో నిధులు జీతాలు ఇచ్చేందుకు లేవని, పంచాయతీ కార్యదర్శులు సమాధానమిస్తూ... ఏడాదిగా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పాల్జేస్తున్నార ని ఇటీవల కలెక్టర్ సమక్షంలోనే ఓ పారిశుధ్య కార్మికుడు తమ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఇలా కొందరు బయట పడుతుండగా.. మరికొందరు తమ ఆవేదనను మనసులోనే దాచుకుంటూ కుటుంబ జీవనాన్ని కొనసాగించలేక అవస్థలు పడుతున్నారు. తమ జీతాలు కూటమి ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందా... అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
గ్రామాల్లో చెత్త, చెదారం, మురికి కుంటలను శుభ్రం చేస్తూ గ్రామాల పరిసర ప్రాంతాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు చెల్లించకపోవడం సరికాదు. మున్సిపల్ కార్మికులు, ఈ గ్రీన్ అంబాసిడర్లు నిర్వహించే విధులు ఒకేలాంటివైనా గ్రీన్ అంబాసిడర్ల జీతాలు 6వేలు మాత్ర మే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ అరకొర జీతం కూడా సక్రమంగా చెల్లించకపోవడం దారుణం. ఈ మేరకు ఇప్పటికే నిరసన వ్యక్తం చేసేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. అలాగే జీతాలు పెంపుదల కూడా చేయా లని డిమాండ్ చేస్తున్నాం.
– వై.మన్మధరావు,
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
గ్రీన్ అంబాసిడర్లకు ఎప్పటికప్పుడు జీతాలు చెల్లించాలని ఆయా పంచాయతీల కార్యదర్శుల కు ఆదేశించాం. బకాయిలు ఉన్న చోట మా దృష్టికి వచ్చిన వెంటనే చెల్లింపులు చేసేందుకు చర్య లు తీసుకొనేలా కార్యచరణ చేస్తున్నాం.
– కొండలరావు, డీపీవో,
పార్వతీపురం మన్యం జిల్లా

వేతన వెతలు..!

వేతన వెతలు..!

వేతన వెతలు..!

వేతన వెతలు..!