
నేరాల దర్యాప్తులో డిజిటల్ ఆధారాలు కీలకం
విజయనగరం క్రైమ్: నేరాల దర్యాప్తులో డిజిటల్ ఆధారలే కీలకమని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. ఈ మేరకు రేంజ్ పరిధిలోని అయిదు జిల్లాలకు చెందిన ఐటీ అనుభవం కలిగిన పోలీస్ సిబ్బందికి గురువారం కై లాసగిరి పోలీస్ గెస్ట్‌హౌస్ లో ఉబెర్ డేటా డిస్‌క్లోజర్ పాలసీపై వర్క్ షాప్ జరిగింది. నేర సంఘటనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణంలో మొబైల్ లొకేషన్ ఆధారంగా నేరస్థులను గుర్తించడంలో ఉబెర్ డేటా ప్రాముఖ్యం గురించి వివరించారు. లీగల్ ప్రాసెస్, డేటా రిక్వెస్ట్ చేయడం, అందుబాటులో ఉంటే సమాచార రకాలు, ప్రైవసీ పరిరక్షణ వంటి అంశాలపై సదస్సు జరిగింది. రేంజ్ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల నుంచి ఐటీ కోర్ టీమ్, సైబర్ సెల్ సిబ్బంది పాల్గొని, సాంకేతికతపై సమగ్రంగా చర్చలు జరిపారు.ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు పోలీసుల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచే దిశగా ఎంతో సహాయపడతాయని అన్నారు.
డీఐజీ గోపీనాథ్ జెట్టి