
డ్వాక్రా రుణాల లెక్కకు లోకోస్
ఒక్కోలా..
రాజాం:
మహిళా సంఘాల పనితీరు, నెలవారీ సమావేశాలు, రుణాల మంజూరీ, చెల్లింపులు, లావాదేవీలన్నీ ఐకేపీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ఇప్పటి వరకు నిర్వహిస్తున్నారు. ఇక ముందు పొదుపు సంఘాల లెక్కలన్నీ పక్కాగా ఉండేలా, ఎవరి లావాదేవీలు వారికి తెలిసేలా లోకోస్ యాప్ పని చేస్తుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, నెలవారీ చెల్లింపులు, బకాయిలు, డిఫాల్ట్ సభ్యుల వివరాలు వంటివి ఈ యాప్‌లో నమోదు చేయనున్నారు. ఈ పనులన్నీ ఆయా గ్రామాల్లోని వీవో లీడర్లు పర్యవేక్షిస్తారు. మొత్తం సమాచారం కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి విభాగానికి అనుసంధానం చేయబడుతుంది. ఇక్కడ మహిళా సంఘాల మొత్తం డేటా ఢిల్లీలో దర్శనమిస్తోంది. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ వంటి రుణాలు బినామీలకు వెళ్లకుండా చెక్ పడుతోంది.
ఇప్పటికే శిక్షణ
లోకోస్ యాప్ వినియోగంపై జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఐకేపీ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. అపోహాలు విడనాడి ఈ యాప్‌ను వినియోగించుకోవాలని సూచిస్తోంది. అన్ని మండలాల్లో వీవోఏలు, వెలుగు సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించారు. గ్రామాల్లోని మహిళా సంఘాల వివరాలన్నీ ఈ యాప్‌ల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీసీలు, సీఎఫ్‌లు, వీవోల ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు ఈ యాప్‌లు ఇచ్చి ప్లే స్టోర్‌లో భద్రం చేశారు. ఈ విధానం ద్వారా దేశ వ్యాప్తంగా పొదుపు సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయనేది డీఆర్‌డీఏ వాదన. ప్రతీ సంఘంలోని లావాదేవీలు, ప్రతీ సభ్యురాలి ఆర్థిక లావాదేవీలు, సంఘ వినియోగం ఈ యాప్‌లో నమోదు చేయబడుతోంది.
జిల్లాలో 62,850 సంఘాలు
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 62,850 సంఘాలు ఉన్నాయి. వీటిలో 6,92,155 మంది సభ్యులు ఉన్నారు. వీరందరి వివరాలు లోకోస్ యాప్‌లో నమోదు చేసేందుకు జిల్లా డీఆర్‌డీఏ విస్తృతంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చిన ఆ శాఖ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం వివరాలు నమోదు పూర్తి చేయాలని హుకుం జారీ చేసింది. ఇప్పటి వరకూ 85 శాతం దాటి వివరాలు నమోదైనట్టు డీఆర్‌డీఏ వెల్లడించింది.
అవగాహన లేదు..
లోకోస్ యాప్‌పై గ్రామాల్లో సంఘాల మహిళలకు అవగాహన లేదు. చాలా మంది మహిళలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ యాప్‌పై సమగ్రంగా అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రతీ మహిళా ఆధార్ కార్డు ఈ యాప్‌లో పొందుపర్చడం ద్వారా సంఘాల పనితీరు, సభ్యులు పనితీరు తెలుస్తుందనేది ఎంత నిజమో.. మహిళల వివరాలు అన్నీ వేరే వారికి తెలుస్తాయన్నది కూడా అంతే వాస్తవం. ఈ విషయంపై గ్రామ స్థాయిలో ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
– లావేటి సులోచన, ఎంపీపీ, రాజాం
85 శాతం పూర్తయింది..
రాజాం నియోజకవర్గంలో లోకోస్ యాప్ వినియోగంపై పక్కాగా అవగాహన కల్పించాం. ఈ యాప్ వినియోగంపై మహిళలకు గ్రామ స్థాయిలో మరింత అవగాహన కల్పిస్తాం. ఎటువంటి అపోహాలు చెందాల్సిన పని లేదు. మహిళా సంఘాల పనితీరు మెరుగుపర్చడంతో పాటు ప్రతీ ఒక్కరికి న్యాయం చేసేందుకు ఈ యాప్ వినియోగపడుతోంది. సాంకేతిక సమస్యలు ఉన్నచోట వాటిని అధిగమిస్తున్నాం. నియోజకవర్గంలో 85 శాతం మేర ఈ యాప్‌లో వివరాలు నమోదు పూర్తయింది.
– ఎ.చిరంజీవి, డీపీఎం, డీఆర్‌డీఏ, విజయనగరం
కొందరికి మోదం.. కొందరికి ఖేదం..!
లోకోస్ యాప్‌పై భిన్నాభిప్రాయాలు
ఇక్కడి సమాచారం అంతా ఢిల్లీ చేతికి
ఐకేపీ సిబ్బంది స్మార్ట్ ఫోన్లలో సాంకేతిక సమస్యలు
డేటా నమోదుకు తంటాలు
కొందరికి సహకరిస్తున్న యాప్‌లు
ఇబ్బందిగా ఉంది..
మా ఆధార్ వివరాలు లోకోస్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే మంచి జరుగుతుందని అన్నారు. ఆధార్ ఇచ్చి అనుసంధానం చేయమన్నాం. ఐతే మా వివరాలు మొత్తం వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయేమోనన్న భయం కూడా మాకు ఉంది.
– సవిరిగాన దమయంతి,
వన్నలి, రేగిడి మండలం
లోకోస్ యాప్‌పై కొంతమందికి అపోహాలు ఉన్నాయి. ఇక్కడి సమాచారం అంతా వేరే చోటకు చేరిపోతుందని, వ్యక్తిగత ఆర్థిక వివరాలు మొత్తం ఢిల్లీకి చేరిపోతాయని కొందరు ఆరోపిస్తున్నారు. తమ వద్ద ఆ యాప్‌లు, మొబైల్స్ లేనప్పుడు అవి తమకు ఎలా తెలుస్తాయని కొందరు మహిళలు వాదిస్తున్నారు. కొందరు వీవోఏలు ఈ యాప్‌ను వినియోగించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ యాప్ ద్వారా తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎంతవరకూ పారదర్శకత ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది. ఈ యాప్ వాడడం ద్వారా సంఘాలకు, అందులోని మహిళలకు పైసా వేసినా, తీసినా తెలుస్తుందని డీఆర్‌డీఏ వివరిస్తుంది.
లోకోస్ యాప్‌లో మహిళా సంఘాల వివరాలు నమోదుపై ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తోంది. కొంతమంది వెలుగు సిబ్బంది మొబైల్స్‌లో ఈ యాప్ ద్వారా సంఘాల వివరాలు నమోదు కావడంలేదని, సాఫ్ట్‌వేర్ సహకరించడంలేదని వాపోతున్నారు. ఈ విషయాన్ని డీఆర్‌డీఏ జిల్లా అధికారులకు తెలియజేస్తే ఎలాగైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రతీ ఒక్కరి వివరాలు నమోదు చేయించాలని ఆదేశిస్తున్నారని వాపోతున్నారు. మరో వైపు ఈ యాప్ వినియోగంపై గ్రామాల్లోని మహిళలు అనాసక్తి చూపుతున్నారని, తమ ఆధార్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని మహిళా సంఘాల గ్రామైఖ్య అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ లోకోస్ యాప్‌లో వివరాలు నమోదు కొస అంచున నిలిచిపోయింది.

డ్వాక్రా రుణాల లెక్కకు లోకోస్

డ్వాక్రా రుణాల లెక్కకు లోకోస్

డ్వాక్రా రుణాల లెక్కకు లోకోస్

డ్వాక్రా రుణాల లెక్కకు లోకోస్

డ్వాక్రా రుణాల లెక్కకు లోకోస్