
సమాజాభివృద్ధికి ఇంజినీరింగ్ విద్య కీలకం
విజయనగరం అర్బన్: సమాజాభివృద్ధికి ఇంజినీరింగ్ విద్య కీలకంగా నిలుస్తుందని, విద్యార్థులు ఆ దిశగా చదువుకోవాలని జేఎన్‌టీయూ జీవీ రిస్ట్రార్ జి.జయసుమ పిలుపునిచ్చారు. వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల కోసం బుధవారం నిర్వహించిన స్టూడెంట్ ఓరియంటేషన్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంజినీర్ సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని, విద్యార్థులు ఎల్లప్పుడూ ఉత్తేజంతో ఉండి కొత్తకోర్సుల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు మాట్లాడుతూ ఓరియంటేషన్ కార్యక్రమం ఉద్దేశాన్ని నూతనంగా ప్రవేశించిన ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థులకు, హాజరైన తల్లిదండ్రులకు వివరించారు. కళాశాల పూర్వవిద్యార్థులు సాధించిన ఉద్యోగాలు, వర్సిటీలోని వసతులను తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జీజే నాగరాజు, ప్లేస్మెంట్ ఆఫీసర్ వి.ఎన్.వకుల, లైబ్రరీ ఇన్‌చార్జ్ బిందుమాధురి పాల్గొన్నారు.