చికెన్‌ | - | Sakshi
Sakshi News home page

చికెన్‌

May 16 2025 12:37 AM | Updated on May 16 2025 12:37 AM

చికెన

చికెన్‌

బ్రాయిలర్‌ లైవ్‌ డెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ125 శ్రీ220 శ్రీ230

భోగాపురం విద్యార్థికి

షైనింగ్‌స్టార్‌–2025 ఆవార్డు

పూసపాటిరేగ: పదవతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన భోగాపురం మోడల్‌స్కూల్‌ విద్యార్థి కొయ్య హరీష్‌కు షైనింగ్‌ స్టార్స్‌–2025 అవార్డు వచ్చింది. ఈ ఏడాది పదవతరగతి ఫలితాల్లో హరీష్‌ 593 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి మోడల్‌స్కూల్స్‌లో ప్రథమస్థానంలో నిలిచాడు. దీంతో ఈనెల 20 వతేదీన అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం, మంత్రుల చేతుల మీదుగా షైనింగ్‌స్టార్‌ –2025 అవార్డు తీసుకోనున్నాడు. ఈనెల 19 వతేదీన మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని లెమన్‌ ట్రీ ప్రీమియర్‌ హోటల్‌లో విద్యార్ధి తల్లిదండ్రులుతో పాటు రిపోర్టు చేయాలని భోగాపురం మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సి.పార్వతి తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వు 20ని సవరించాలి

పార్వతీపురంటౌన్‌: రాష్ట్ర విద్యాశాఖలో తొమ్మిది రకాల పాఠశాలల ఏర్పాటు ఆశాసీ్త్రయమని, కొత్తగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్వర్వు 20లోని నియమాలు విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయని ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌. బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 117నంబర్‌ ఉత్తర్వులకన్నా ఈ నిబంధనలు దారుణంగా ఉన్నాయని, ఉపాధ్యాయ సంఘాలతో లెక్కలేనన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా వారి సూచనలను వేటినీ పరిగణనలోకి తీసుకోకపోవడం అప్రజాస్వామ్యమన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి సహేతుకం కాదన్నారు. ప్రస్తుత ఉత్తర్వులు ఉపాధ్యాయులకు పనిభారాన్ని పెంచాలనే లక్ష్యంతోనే రూపొందించినట్లు అర్ధమవుతోందన్నారు. వీటి ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు కనీసం వారానికి 40 పీరియడ్లకు తక్కువ కాకుండా పనిచేయాల్సి ఉంటుందని, కొంతమంది ఇంకా ఎక్కువ పీరియడ్స్‌ కూడా పనిచేయవలసి వస్తుందన్నారు. కావున ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉత్వర్వులను సవరించాల్సిందిగా కోరుతున్నామన్నారు.

యూపీహెచ్‌సీల్లో వైద్యసేవలు మెరుగు పరచాలి

పార్వతీపురంటౌన్‌: పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగు పర్చాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు ఆ దేశించారు. ఈ మేరకు యూపీహెచ్‌సీ వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో గురువారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో, క్షేత్రస్థాయి సేవలపై నెలవారీ నివేదికలను పరిశీ లించారు.ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ వివరాలు, ల్యాబ్‌ పరీక్షలు, మందులు, ఈహెచ్‌ఆర్‌ నమోదుపై సమీక్షించారు. కార్యక్రమంలో డీఐఓ నారాయణరావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ టి.జగన్మోహనరావు, డా పీఎల్‌.రఘు కుమార్‌, డీపీఓ లీలారాణి, వైద్యాధికారులు డా.రవిచంద్ర, డా.గణేష్‌, డా.చాంద్‌, కార్యాలయం ఏఓ సాల్మన్‌ రాజ్‌, సీసీ శ్రీనివాసరావు, ఏఎన్‌ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పిడుగుపాటుకు

మూడు ఆవుల మృతి

మక్కువ: మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ గిరిశిఖర గ్రామమైన చిలకమండంగి గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపడి మూడు ఆవులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన గిరిజన రైతు కొండతామర సోములు ఇంటి ముందు ఉన్న చెట్టు సమీపంలో మూడు పాడి ఆవులను కట్టాడు. భారీ వర్షంతో పాటుగా పిడుగులు పడడంతో ఆవులు మృతి చెందాయి. కుటుంబానికి జీవనాధారమైన ఆవుల మృతితో రైతు సోములు, కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

చికెన్‌1
1/3

చికెన్‌

చికెన్‌2
2/3

చికెన్‌

చికెన్‌3
3/3

చికెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement