న్యూస్‌రీల్
సాయంత్రం వరకు మభ్యపెట్టి.. మాయ చేసి..
ఏకగ్రీవాల బాధ్యత తీసుకుని...
ఎన్నికల్లో తలపడి గెలవాలి
శనివారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2026
ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. తీవ్రంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనే ధైర్యం లేని కూటమి నాయకులు అడ్డదారుల్లో గెలించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు నిస్సిగ్గుగా వత్తాసు పలుకుతున్నారు. న్యాయస్థానాల ఆదేశాలను పక్కనపెట్టి యూనిఫాం వేసుకున్న ‘పచ్చ’ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న పోలీసులు
● 23 వరకు స్వీకరణ ప్రక్రియ
● జిల్లాలో 189 పంచాయతీలు,
2,012 వార్డులు
● క్లస్టర్ల వారీగా మొత్తం
59 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థాయిలో అండర్–19 చదరంగ పోటీలను భారతీయ విద్యాభవన్‌లో ఆదివారం నిర్వహించనున్నట్లు భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని పాఠశాలలో పోటీలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. రామచంద్రరాజు మాట్లాడుతూ భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్, ఆనంద్ చెస్ వింగ్స్ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు రూ.70 వేల నగదుతోపాటు వివిధ రకాల ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆనంద్ చెస్ వింగ్స్ డైరెక్టర్ ఎం.గోపీనాథ్‌ను ఫోన్ నంబరు 97030 49378లో సంప్రదించాలని సూచించారు. ఇంటాక్ జిల్లా కన్వీనర్ రవి శంకర్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు 155 మంది
దరఖాస్తుదారులు హాజరు
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) పరిధిలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చేపట్టిన ‘ఎల్‌ఆర్‌ఎస్ మేళా’కు శుక్రవారం స్పందన లభించింది. నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌తోపాటు బృందావన్ గార్డెన్స్‌లోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ మేళాకు తొలిరోజు 155 మంది దరఖాస్తుదారులు హాజరయ్యారు. సిటీ ప్లానర్ డి.రాంబాబు మాట్లాడుతూ మేళా శనివారం కూడా కొనసాగుతుందని చెప్పారు. పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫీజు చెల్లించాల్సిన వారు, దరఖాస్తుల పరిశీలనలో షార్ట్ ఫాల్ ఎండార్స్‌మెంట్లు జారీ అయి అవసరమైన పత్రాలు సమర్పించాల్సిన వారు వచ్చి క్లియర్ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలు, రశీదులతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో శుక్రవారం ఉదయం నుంచి మూడు వార్డులకు చెందిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయిస్తామంటూ పోలీసులు మభ్యపెట్టారు. సాయంత్రం 4.15 గంటలకు ఆర్‌డీవో కార్యాలయంలో నామినేషన్లు వేయిస్తామంటూ జీపులో ఎక్కించుకున్నారు. అక్కడకు తీసుకెళ్లకుండా సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయం వద్ద వదిలి వెళ్లిపోయారు. సమయం 5 గంటలు దాటిపోయిందని, ఇక నామినేషన్లు వేయడం కుదరదని డీఎస్పీ చెప్పడంతో పోలీసులే బరితెగించి ఇలా కుట్ర పన్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో రోడ్లపై తిరుగుతూ నామినేషన్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బయట నుంచి కిరాయి రౌడీలను తీసుకొచ్చి, నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. చినబాబు అండదండలు ఉన్నాయని చెప్పుకొనే పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదేశాలతో టీడీపీ గూండాలు, కిరాయి మూకలు రెచ్చిపోయి మరీ దాడులకు దిగుతున్నాయి. నామినేషన్లు వేసేందుకు వస్తున్న మహిళలను సైతం విచక్షణ కోల్పోయి చీరలు లాగడం, కర్రలు, రాడ్లతో కొట్టడం వంటి అమానవీయ ఘటనలకు పాల్పడుతున్నారు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరుగుతున్నప్పటికీ, అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో పనిచేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప శాంతిభద్రతలను కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. అసలు కొన్ని చోట్ల పోలీసులే పచ్చచొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా మారిపోయి, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, మహిళలపై నేరుగా దాడులు చేస్తూ, లాఠీలతో, బూటు కాళ్లతో తన్ని దిగజారి వ్యవహరిస్తున్నారు. వీరి బరితెగింపు ఏ స్థాయిలో ఉందంటే, టీడీపీ గూండాల కోసం తెచ్చిన కర్రలు, రాడ్లతో ఉన్న ఓ వాహనాన్ని పట్టుకుని.. అవి వైఎస్సార్ సీపీ నాయకులకు చెందినవంటూ నిందలు మోపి అక్రమ కేసులు బనాయించారు.
పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి 64 గ్రామాలకు చెందిన వారు పోలీసు రక్షణతో నామినేషన్లు వేసేందుకు హైకోర్టు అనుమతి పొందారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, నామినేషన్ కేంద్రాల వద్ద కర్రలు, రాడ్లతో తిరుగుతున్న టీడీపీ గూండాలను అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా నామినేషన్లు వేయించలేని పరిస్థితుల్లో కోర్టుకు సమాధానం చెప్పుకోలేక, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను పిలిచి రాజీ కుదుర్చుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడే స్థాయికి దిగజారారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం నుంచి ఏకంగా ఓ డీఎస్పీ స్థాయి అధికారి మొదలుకొని అన్ని మండలాల ఎస్‌ఐల వరకు రాజీ పేరుతో వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై బెదిరింపులకు తెరతీశారు. వైఎస్సార్ సీపీకి ప్రతి మండలంలో మెజారిటీ గ్రామాల్లో బలం ఉన్నప్పటికీ, కేవలం 11 స్థానాలు మాత్రమే కేటాయిస్తామని, అది కూడా తీసుకోమని మొండికేస్తే హత్యాయత్నం కేసులు బనాయించి జైళ్లకు పంపుతామని బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించి వందలాది మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. తమకు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, తమకు రక్షణ కల్పించి నామినేషన్లు వేయించాలని ఎంత ప్రాధేయపడినా పోలీసులు మాత్రం రాజీ కుదుర్చుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా, హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న అభ్యర్థులను బెదిరించి మరీ పోలీసులు సంతకాలు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే, పోలీసులు నామినేషన్లు వేయించలేదంటూ తిరిగి కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా, అభ్యర్థులే స్వచ్ఛందంగా నామినేషన్లు వేయకుండా విరమించుకున్నట్లు రాసుకుని బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ప్రజాస్వామ్యం.. అపహాస్యం
నేటి నుంచి మూడో విడత నామినేషన్‌లు
పకడ్బందీ ఏర్పాట్లు
సత్తెనపల్లి: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టాన్ని కూడా కూటమి నేతలు అపహాస్యం చేశారు. దాడులు .. దౌర్జన్యాలు .. బెదిరింపులు .. నామినేషన్ పత్రాల చించివేతతో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు 150 సర్పంచ్ స్థానాలకు, 1,562 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతి, అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు, బెల్లంకొండ మండలాల్లో ప్రక్రియను పూర్తిగా అపహస్యం చేశారు. పచ్చమూకలు రోడ్లపై తిరుగుతూ నామినేషన్ పత్రాలను చించి వేయడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలకు దిగాయి. పోలీసులు కూడా ఏకంగా మహిళలపై లాఠీచార్జి, బూటు కాలుతో మహిళ కడుపులో తన్నడం వంటి ఘటనలు చేసుకున్నాయి. దీంతో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు రాగా ఆర్‌డీవో కార్యాలయం చుట్టుపక్కల పచ్చ మూకలు చేరి నామినేషన్ పత్రాలను లాగేసుకున్నాయి. దీనిపై పోలీసులు కూడా కూటమి నేతలకు సహకరించడంతో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయలేకపోయారు. వ్యతిరేకత వస్తుందని భావించిన పోలీసులు... సెటిల్మెంట్ వ్యవహారం నడిపారనే విమర్శలు ఉన్నాయి.
ఏకగ్రీవానికి దౌర్జన్యం...
సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు అతిపట్ల శ్రీనివాసరావు, కూటమి మద్దతుదారుడు పుట్టి హను మంతరావు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. పుట్టి హనుమంత రావు పోలీసులను అడ్డుపెట్టుకొని ఏకగ్రీవం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇది గ్రహించిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులు... అత్తిపట్ల శ్రీనివాసరావును కొమెరపూడిలో గురువారం రాత్రి ఉంచి శుక్రవారం ఉదయం గ్రామంలో ఓటర్లకు కనిపించేందుకు లక్కరాజుగార్లపాడు వెళ్లారు. వెంటనే సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబు ఇద్దరు కానిస్టేబుళ్లను పంపి శ్రీనివాసరావును సత్తెనపల్లి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎందుకు రావాలని శ్రీనివాసరావుతోపాటు మరో న్యాయవాది కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలో అత్తిపట్ల శ్రీనివాసరావు యర్రగుంట్లపాడు, ఫిరంగిపురం వైపు వెళ్లి పోయారు. అనంతరం తిరిగి నామినేషన్ దాఖలు చేసేందుకు కొమెరపూడి రాగా... కూటమి నేతలు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి రావడంతో గత్యంతరం లేక శ్రీనివాసరావును వదిలి పెట్టారు. శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా వెళ్లనివ్వకుండా సీఐ రాంబాబు అడ్డుకునే ప్రయత్నం చేయడం, నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారులు కూడా సంతకాలు లేవంటూ కావాలనే అభ్యంతరాలు పెట్టడం వంటి హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో కొమెరపూడి నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరకు అత్తిపట్ల శ్రీనివాసరావు లక్కరాజు గార్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
మండలం ఓటర్ల సర్పంచ్ వార్డుల
సంఖ్య స్థానాలు సంఖ్య
చిలకలూరిపేట 42,369 22 216
యడ్లపాడు 44,581 18 190
నాదెండ్ల 53,289 15 172
గురజాల 34,247 12 132
దాచేపల్లి 34,664 14 144
మాచవరం 43,454 15 162
పిడుగురాళ్ల 52,607 16 184
మాచర్ల 40,293 16 166
వెల్దుర్తి 41,628 20 198
కారంపూడి 46,982 15 158
రెంటచింతల 40,640 11 132
దుర్గి 41,939 15 158
మొత్తం 5,16,693 189 2,012
పల్నాడు జిల్లాలో మూడో దశ ఎన్నికలు జరగనున్న గురజాల, మాచర్ల, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాలకు సంబంధించి అన్ని పంచాయతీలు టీడీపీకి ఏకగ్రీవమయ్యేలా చేసే బాధ్యతను కొందరు అవినీతి ఖాకీలు తమ భుజాన వేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ మూడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఎవరూ సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేయకుండా ఇప్పటి నుంచే బెదిరింపుల పర్వానికి తెరతీశారు. ఇందులో భాగంగా మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఇప్పటికే వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలందరినీ స్టేషన్లకు పిలిపించి, బైండోవర్‌ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. నామినేషన్లు వేయకుండా రాజీకి రావాలని, కాదని నామినేషన్లు వేసేందుకు ప్రయత్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కావడానికి వీల్లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పోస్టింగ్‌ల కోసం అర్రులు చాచే కొందరు అవినీతి పోలీసు అధికారులు పచ్చచొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నట్లుగా, అసలు తాము పోలీసులమనే విషయాన్నే మరిచి పచ్చపార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్న తీరు పోలీసు శాఖ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉంది. పల్నాడులో నామినేషన్లు వేసి ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీ మద్దతుదారులు 80 శాతం పంచాయతీలను కైవసం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓటమి భయంతోనే అధికార పార్టీ వారు అరాచకాలు సృష్టిస్తున్నారు.
పోలీస్ స్టేషన్లకు పిలిచించి మరీ
పోటీ నుంచి తప్పుకోవాలంటూ హుకుం
మాట వింటే కొన్ని పంచాయతీలు
ఇప్పిస్తానంటూ ఓ డీఎస్పీ బేరసారాలు
మాట వినకుంటే హత్యాయత్నం కేసు
నమోదు చేస్తానంటూ హెచ్చరికలు
టీడీపీ గూండాల వాహనంలో
కర్రలు, రాడ్లు దొరికితే వైఎస్సార్ సీపీ
వారిపై తప్పుడు కేసు
పెదకూరపాడు ఎమ్మెల్యే ఆదేశాలతో
రెచ్చిపోతున్న పోలీసులు
గురజాల, మాచర్ల, చిలకలూరిపేటలో
అన్ని పంచాయతీల ఏకగ్రీవానికి
సహకారం అందిస్తున్న ఖాకీలు
లక్కరాజుగార్లపాడు వైఎస్సార్ సీపీ
మద్దతుదారుడిపై దౌర్జన్యం
కొమెరపూడి నామినేషన్
కేంద్రం వద్ద ఉద్రిక్తత
పోలీసుల ఆంక్షల నడుమ
11 పంచాయతీల అభ్యర్థులే
నామినేషన్ దాఖలు
మాదిపాడు జనసేన అభ్యర్థి
పద్మాబాయి నామినేషన్ పత్రాలు
లాక్కెళ్లిన దుండగులు
మాది అచ్చంపేట మండలం గింజుపల్లి గ్రామం. మాదిపాడు పంచాయతీ. నేను జనసేన తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి సత్తెనపల్లి ఆర్‌డీఓ కార్యాలయం వద్దకు వచ్చా. ఇక్కడ రౌడీ మూకలు నామినేషన్ పత్రాలు లాక్కుకున్నాయి. ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు. గెలిచే రాజకీయం ఇలా ఉండదు. మొత్తం దొంగ రాజకీయమే నడుపుతున్నారు. గెలిచే వాళ్లు అయితే ధైర్యంగా ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకొనేవారు.
–బాణావత్ పద్మాబాయి


