పదేళ్ల తరువాత మున్సిపల్ ఎన్నికలు జిల్లా విభజన అనంతరం తొలిసారి పోరు ఇప్పటి వరకు 11 మంది చైర్మన్లుగా చేసిన ఘనత
నరసరావుపేట: నరసరావుపేట మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నికపై ఆసక్తి నెలకొంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పురపాలక సంఘానికి ఇప్పటి వరకు 24 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. 25వ చైర్మన్ స్థానానికి ఈనెల 26న నిర్వహించనున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున షేక్ ఖాజావలి మాస్టారు, టీడీపీ అభ్యర్థిగా నాగసరపు రూపేష్ గుప్తా పోటీ పడుతున్నారు. పల్నాడు జిల్లా 2022 ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రంగా ఉన్న నరసరావుపేటలోని పురపాలక సంఘానికి ఇదే తొలి ఎన్నికలు. ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇవి రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు. 2020లో జరగాల్సిన ఎన్నికలు కోర్టు కేసుల కారణంగా జరగక పోవటంతో పురపాలక సంఘానికి ఇప్పుడు పదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు చైర్మన్లలో దేశానికి స్వాతంత్య్రం లభించిన నాటి నుంచి పరిశీలిస్తే.. టి.రామమోహనరావు (1947), బీవీ గోవిందరాజులు(1956), కొత్తూరి వెంకటేశ్వర్లు(1956–59), తుమ్మల రామకోటయ్య(1959–64), షేక్ ఫరీద్ (1981–83), షేక్ మహబూబ్ సుభాని (1983–86), క్రోసూరి రంగారావు(1987–1992), వనమా సుబ్బారావు (1995–2000), గోనుగుంట్ల జోగేశ్వరమ్మ(2000–2005), కుంచాల రోశమ్మ(2005–2010), నాగసరపు సుబ్బరాయగుప్తా (2014–19) వ్యవహరించారు.


