మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని

Nov 21 2026 2:20 AM | Updated on Nov 21 2026 2:20 AM

మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని

16వ వార్డు నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా జాహ్నవి పోటీ

నరసరావుపేట: బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న కొత్తమద్ది జాహ్నవి మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రకాష్‌నగర్‌లోని 16వ వార్డు నుంచి ఆమె వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి లక్ష్మారెడ్డి పట్టణంలో నిత్యావసరాల షాపు నిర్వహిస్తుండగా తల్లి గృహణి. జాహ్నవి హైదరాబాదులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ బిట్స్‌ పిలానీతో ఒప్పందంతో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను ఓ మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకొని అవి పరిష్కారం చేసేందుకు తన వంతు కృషిచేస్తానని చెప్పారు. తనకు వార్డు ప్రజలు మద్దతు పలకాలని కోరారు.

విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్‌లు పంపిణీ

నరసరావుపేట: కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ 20 మంది విద్యార్థినీ, విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశానుసారం సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోరల్‌ పార్టిసిపేషన్‌(ఎస్‌వీఈఈపీ)పై జిల్లాలలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలో ఎలక్టోరల్‌ లిటరసీ క్లబ్స్‌ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులలో ఎలక్షన్‌ ప్రక్రియ, ఓటింగ్‌ విధానంపై అవగాహన కోసం వ్యాసరచన, క్విజ్‌ పోటీలు ఇటీవల నిర్వహించారు. పాఠశాల స్థాయిలో 25,330 మంది విద్యార్థులు, నియోజకవర్గ స్థాయిలో 1192 మంది, జిల్లా స్థాయిలో 140 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ చూపించిన జిల్లా స్థాయి వ్యాసరచన విభాగంలో 10 మందికి, క్విజ్‌ విభాగంలో 10 మంది విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్స్‌ అందజేశారు. వ్యాసరచన పోటీలో ఎం.జాహ్నవి, డి.లావణ్య, వై.నాగలక్ష్మి, ఎ.జయశ్రీ, కె.రాజకుమారి, సీహెచ్‌ సాయి లక్ష్మీశరణ్య, బి.రాగసుధ, టీబీ శరణ్య, కె.పద్మాంజలి, డి.అక్షయ, క్విజ్‌ విభాగంలో కె.రిషితా శ్రీకరి, పి.ఉమాదేవి, యు.భాగ్యశ్రీ, టి.పూజిత, వి.దేవదాసు, వి.సృజన, ఎస్‌.దివ్వ, షేక్‌ హసన్‌బాష, కె.మెడికర్‌ సాయిరామ్‌, బి.లక్ష్మీప్రసన్నలు ఉన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దెయ్య, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సీఈఓ ీస్లీవారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, కలెక్టరేట్‌ ఏఓ నాగిరెడ్డి ప్రధానాపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement