వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి

Nov 21 2026 2:20 AM | Updated on Nov 21 2026 2:20 AM

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి

●మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి ● నరసరావుపేటలో విస్తృతంగా ప్రచారం

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలనిమాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి ప్రజలను కోరారు. 15వ వార్డు అభ్యర్థి వేలూరి సుబ్బారెడ్డికి మద్దతుగా శుక్రవారం ప్రచారం చేశారు. బాణసంచా కాల్చి, పూలతో వారికి శ్రేణులు స్వాగతం పలికాయి. ప్రకాష్‌నగర్‌ 60 అడుగుల రోడ్డు, జెండా చెట్టురోడ్డు, బ్యాంకు కాలనీ, ముస్లిం బజారులలో మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి షేక్‌ ఖాజావలి మాస్టారుతో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. డాక్యుమెంట్‌ రైటర్‌ అజీజ్‌ను మద్దతు కోరారు. మాజీ ఎమ్మెల్యేలను అభ్యర్థి సుబ్బారెడ్డి సన్మానించారు. బాబాపేటలోని 9వ వార్డులో షేక్‌ అఫీఫాకు మద్దతుగా డాక్టర్‌ గోపిరెడ్డి ప్రచారం చేశారు. జెండా చెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు. ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని షేక్‌ ఖాజావలి ప్రారంభించారు. ప్రకాష్‌నగర్‌లో 20వ వార్డు అభ్యర్థి కొండపల్లి వరలక్ష్మి విజయం కోరుతూ ప్రచారం నిర్వహించారు. డాక్టర్‌ జహీర్‌ అబ్బాస్‌, డాక్టర్‌ విభాగ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement