పోలింగ్‌లో పాల్గొనవద్దంటూ బెదిరిస్తున్న టీడీపీ | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌లో పాల్గొనవద్దంటూ బెదిరిస్తున్న టీడీపీ

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

నరసరావుపేట:స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో మీరు ఏవిధంగా ఓటు వేస్తారో చూస్తామంటూ టీడీపీ కూటమి నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ వారిని బెదిరిస్తున్నారని పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, పల్నాడు జిల్లా పార్లమెంటు పరిశీలకులు పి.గౌతమ్‌రెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో చిలకలూరిపేట, వినుకొండ పార్టీ పరిశీలకులు, జిల్లా లీగల్‌సెల్‌ అధ్యక్షురాలితో కలిసి మాట్లాడారు. వినుకొండలో జరిగిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త హత్యపై అక్కడి టీడీపీ నాయకులు మతచిచ్చు రేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దానికి అక్కడి సీఐ సపోర్టు చేస్తున్నారన్నారు. మంత్రి లోకేష్‌ ఇచ్చే డైరెక్షన్‌లోనే అంతా అనుసరిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లాలో కనీసం తమను నామినేషన్లు వేయనీయకుండా చేసి ఇప్పుడు జరగబోయే పోలింగ్‌లో ఓటు కూడా వేయనీయమంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. వినుకొండలో 36 డివిజన్లలోను, మాచర్లలో అన్నీ డివిజన్లులో పోటీలో ఉన్నామన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో కొన్నిచోట్ల తమ పార్టీ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారని, దీనిని చూసి ఎన్నికలు సజావుగా జరిగితే మళ్లీ వైఎస్సార్‌ సీపీకి ప్రజలు మద్దతు తెలియచేస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు, లోకేష్‌ల పర్యవేక్షణలో గుండాలతో రాజ్యం ఏలేందుకు రాక్షస క్రీడకు తెరతీసారన్నారు.

పల్నాడులో వికృత క్రీడ....

చిలకలూరిపేట పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ పల్నాడులో వికృత క్రీడ నడుస్తుందన్నారు. ఆటవిక పరిపాలన పల్నాడు జిల్లాలో చూస్తున్నామన్నారు. గురజాల, చిలకలూరిపేట, మాచర్ల, వినుకొండలతో పాటు పెదకూరపాడులో కనీసం నామినేషన్లు కూడా వేయనీయలేదన్నారు. చిలకలూరిపేటలో చైర్మన్‌ అభ్యర్ధిని తీసుకెళ్లి ఆమె భర్తను వేధించి తమవైపుకు తిప్పుకున్నారన్నారు. 16 మందిని కౌన్సిలర్‌ అభ్యర్ధులను కొన్నారన్నారు. జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షురాలు రోళ్ల మాధవి మాట్లాడుతూ గత మూడేళ్లలో మంచిపని చేసి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీని చూసి ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారో సమాధానం చెప్పాలని కోరారు. ఎందుకు తమ వారిని నామినేషన్లు వేయనీయట్లేదని ప్రశ్నించారు. పోలీసులను అడ్డంపెట్టుకొని ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నారన్నారు. ఈవిధంగా గెలిచిన గెలుపు గెలుపే కాదనేది వాస్తవం అన్నారు. నిజంగా ప్రజలకు మేలు చేసి ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని కూటమి నాయకులకు పిలుపు ఇచ్చారు.

వైఎస్సార్‌ సీపీ నాయకులు గౌతమ్‌రెడ్డి, చిట్టా, రోళ్ల మాధవి, బాసు లింగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement