ప్రకాశం బ్యారేజీపై రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ప్రకాశం బ్యారేజీపై రోడ్డు ప్రమాదం

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

పారిశుద్ధ్య కార్మికుడు దుర్మరణం

తాడేపల్లి రూరల్‌: ప్రకాశం బ్యారేజీపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషా దాన్ని నింపింది. విజయవాడ నుంచి తాడేపల్లి వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మందడం టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్న పొట్లూరి సాంబశివరావు (40) వెంకటపా లెం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం విజయవాడ నుంచి తాడేపల్లి వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా, బ్యారేజీపైకి చేరుకున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సాంబశివరావుకు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉండగా, ఆ వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. రోజువారీ విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న సాంబశివ రావు ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యు లు, పరిచయస్తుల్లో విషాదం నెలకొంది. బ్యారేజీపై వాహనా ల రాకపోకలు అధికంగా ఉండే నేపథ్యంలో వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, అప్రమత్తంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement