నేడు పోలీసు పీజీఆర్‌ఎస్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు పోలీసు పీజీఆర్‌ఎస్‌ రద్దు

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

నేడు పోలీసు పీజీఆర్‌ఎస్‌ రద్దు వాగులు, కల్వర్టుల వద్ద ప్రత్యేక నిఘా పోలింగ్‌ స్లిప్పుల పంపిణీలో నిర్లక్ష్యం ● ఇంటింటికి పంపిణీ చేయని బీఎల్‌వోలు, అధికారులు ● పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల ఇబ్బందులు పోలింగ్‌ కేంద్రాల్లోకి మీడియాకు అనుమతి నిరాకరణ నేపాల్‌కు చెందిన కార్మికుడు మృతి

నరసరావుపేట రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయా న్ని గమనించి సహకరించాలని కోరారు.

¯]lÆý‡çÜ-Æ>Ð]l#õ³r Æý‡*Æý‡-ÌŒæ:️ మురసు తుఫాన్‌ నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు, సిబ్బంది తమ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జగదీశ్‌ ఆదహళ్లి ఆదేశించారు. తుఫాన్‌ ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, ట్రాఫిక్‌కు ఆటంకాలు ఏర్పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా వాగులు, కల్వర్టుల వద్ద పోలీస్‌ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని, ప్రమాదకరంగా ప్రవహించే వాగుల్లోకి ప్రజలు దిగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా ఇబ్బంది ఎదురైనా, అత్యవసర పోలీస్‌ సహాయం అవసరమైనా పల్నాడు జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 94407 96184, 112కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు పల్నాడు జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని జిల్లా ఎస్పీ తెలిపారు.

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లకు పోల్‌ స్లిప్పుల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బూత్‌ లెవల్‌ అధికారులు(బీఎల్‌వోలు) ఏ ఎన్నికల్లో అయినా ఇంటింటికి వెళ్లి అందజేస్తుంటారు. ఈ ఎన్నికల్లో చాలాచోట్ల పంపిణీ చేయలేదు. దీంతో పలు డివిజన్లలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు మున్సిపల్‌ సిబ్బందికి ఓటరు కార్డు చూపించి స్లిప్పులు పొందారు. ఓటేసేందుకు ఇబ్బంది లేకున్నా పోలింగ్‌ స్లిప్పులు పొందడానికి ఓటర్లు వేచి చూడాల్సి వచ్చింది. టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులు పలువురు తమ ఫొటో, గర్తు, పేరుతో కూడిన పోలింగ్‌ స్లిప్పులను ఓటర్లకు అందజేశారు. తమకే ఓటు వేయాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల్లో సైతం అభ్యర్థుల ఫొటోలతో కూడిన పోల్‌ స్లిప్పులను తీసుకుని వెళ్లగా అధికారులు వాటిని తీసుకుని ఓటు వేయించారు. అంతేకాకుండా పలుచోట్ల పోలింగ్‌ స్లిప్పులు కవర్లలో వేసి రోడ్డుపై గుట్టలుగా పడేశారు.

కొరిటెపాడు(గుంటూరు): నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కవరేజికి వెళ్లిన మీడియాకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్ల ఫొటోలు తీయడానికి అనుమతి ఇవ్వలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల వెంట అనుచరులు, పీఏలు వెళ్లినా అడ్డుకోని పోలీసులు.. మీడియాను మాత్రం నిలిపివేయడం విస్మయానికి గురిచేసింది. పలు డివిజన్లలోని పోలింగ్‌ బూతుల్లో అనుమతించిన పోలీసులు ఇక్కడ ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా కేంద్రాల వద్ద వంద మీటర్ల అవతలే మీడియా ప్రతినిధులను నిలిపివేశారు. దీంతో పోలింగ్‌కు సంబంధించిన ఫొటోల కోసం మీడియా ప్రతినిధులు నానా ఇబ్బందులు పడ్డారు.

చిలకలూరిపేటటౌన్‌: గ్రానైట్‌ రాళ్లను శిల్పాలుగా చెక్కుతుండగా జరిగిన ప్రమాదంలో నేపాల్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మురికిపూడి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నేపాల్‌లోని దంగ్‌ జిల్లా రాప్తి గ్రామీణ మున్సిపాలిటీకి చెందిన అజిత్‌ బుధామగర్‌(24) మురికిపూడి గ్రామంలో గ్రానైట్‌ రాళ్లను హ్యాండ్‌గ్రైండర్‌(డిస్క్‌)తో చెక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ గ్రైండర్‌ మిషన్‌ అతడి కుడి తొడపై పడటంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో చిలకలూరిపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 10.12 గంటలకు అజిత్‌ మృతి చెందాడు. మృతుడి తమ్ముడు అశోక్‌ బుధామగర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్‌ ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement