స్పాస్మోడిక్ డిస్ఫోనియాపై జాతీయ స్థాయి ఫోనోసర్జరీ కోర్సు, వర్క్‌షాప్
గుంటూరు మెడికల్: లలితా సీఎంఈ సిరీస్‌లో భాగంగా ‘స్పాస్మోడిక్ డిస్ఫోనియా– ప్రాథమిక అంశాల నుంచి అత్యాధునిక చికిత్సా విధానాల వరకు’ అనే అంశంపై 20వ జాతీయ స్థాయి ఫోనోసర్జరీ కోర్సు, వర్క్‌షాప్ ఆదివారం గుంటూరులోని లలితా పీవీఎస్ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఇన్‌న్ స్టిట్యూట్ ఆఫ్ ఈఎన్‌టీ అండ్ మెలోడీ వాయిస్ క్లినిక్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ ఫోనోసర్జన్‌న్, లలితా పీవీఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూరోసైంటిస్ట్స్ అసోసియేషన్, గుంటూరు, ఏపీఏఎస్‌ఎల్‌పీఏ అకాడమీ ఆఫ్ ఒటోలారింజాలజీ– హెడ్ అండ్ నెక్ సర్జరీ, గుంటూరు శాఖ, అమెరికాకు చెందిన వాయిస్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, లలితా పీవీఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఈఓ డాక్టర్ పి.అనురాగ్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు ప్రముఖ వైద్యులు, వైద్య నిపుణులు, అధ్యాపకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు మాట్లాడుతూ స్పాస్మోడిక్ డిస్ఫోనియా అనేది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఒక వాయిస్ డిజార్డర్ అని, ఇందులో స్వరపేటికలోని స్వరతంత్రుల కండరాలు అనియంత్రితంగా సంకోచించడం వలన మాటలో అంతరాయాలు ఏర్పడి, స్పష్టంగా మాట్లాడటం కష్టమవుతుందని వివరించారు. ఈ వ్యాధి నిర్ధారణ, చికిత్సలో వస్తున్న ఆధునిక వైద్య విధానాలపై సదస్సులో చర్చించారు. స్పాస్మోడిక్ డిస్ఫోనియా ప్రాథమిక అంశాలు, వ్యాధి లక్షణాలను గుర్తించడం, ఇతర వాయిస్ సమస్యల నుంచి ఈ వ్యాధిని వేరు చేసి నిర్ధారించడం, లారింగోస్ట్రోబోస్కోపీ, డైనమిక్ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ, వాయిస్ అనాలిసిస్ వంటి అంశాలపై నిపుణులు వివరించారు. చికిత్సా విధానాల్లో భాగంగా బొటాక్స్ చికిత్స, ఈఎంజీ మార్గదర్శకత్వంలో, ఎండోస్కోపీ సహాయంతో బొటాక్స్ ఇంజెక్షన్లు ఇవ్వడం, లేజర్ థైరొ అరైటినాయిడ్ మయోన్యూరెక్టమీ, టైప్–2 థైరొప్లాస్టీ, ఎస్‌ఎల్‌ఏ అండ్ ఆర్ వంటి అత్యాధునిక శస్త్రచికిత్సా పద్ధతులపై ప్రత్యేకంగా చర్చించారు. అలాగే డిస్ఫోనియా సమస్యపై న్యూరాలజిస్టుల దృక్కోణం, నూతన ఔషధ చికిత్సలు, భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న వైద్య విధానాలు, సైకోథెరపీ, వాయిస్ థెరపీ ప్రాధాన్యాన్ని కూడా వివరించారు. ఇలాంటి సమస్యల చికిత్సలో న్యూరాలజీ, ఈఎన్‌టీడీ, సైకియాట్రీ, స్పీచ్ థెరపీ విభాగాల సమన్వయం ఎంతో అవసరమని నిపుణులు పేర్కొన్నారు. లలితా పీవీఎస్ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.వి.రాఘవ శర్మ కార్యక్రమానికి ప్యాట్రన్‌న్‌గా వ్యవహరించారు. గుంటూరుకు చెందిన సత్యసాయి ఈఎన్‌టీ– మెలోడీ వాయిస్ క్లినిక్ లారింగాలజిస్ట్ డాక్టర్ వి.ఫణీంద్రకుమార్, లలితా పీవీఎస్ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అంకినీడు అడ్వాన్స్‌డ్ స్ట్రోక్ సెంటర్ చీఫ్ న్యూరాలజిస్ట్, డైరెక్టర్ డాక్టర్ పమిడిముక్కల విజయ ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్స్, కోర్సు డైరెక్టర్లుగా వ్యవహరించారు. సదస్సులో డాక్టర్ ఆర్.జయకుమార్, డాక్టర్ ఎన్.వి.సుందరచారి, డాక్టర్ వి. రామతారక్‌నాథ్, డాక్టర్ సి.శివ రామకృష్ణ, డాక్టర్ షర్మిల, డాక్టర్ జి.చందన, డాక్టర్ నీరజ, డాక్టర్ పి.ఎస్.ఎన్.మూర్తి, డాక్టర్ మీనా కుమారి, డాక్టర్ కె.సురేష్ కుమార్, డాక్టర్ ఆర్.శిరీష తదితర ప్రముఖ వైద్యులు ఫ్యాకల్టీ సభ్యులుగా పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించారు. గుంటూరు, విజయవాడ, ఏఐఐఎంఎస్ మంగళగిరి, తిరువనంతపురం తదితర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులు హాజరయ్యారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రెండు క్రెడిట్ అవర్స్ మంజూరు చేసింది. వివిధ ఆసుపత్రులు, వైద్య సంస్థలకు చెందిన సుమారు 150 మంది ప్రతినిధులు, ఇందులో న్యూరాలజిస్టులు, ఈఎన్‌టీ సర్జన్లు, ఫిజీషియన్లు, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్టులు పాల్గొన్నారు.


