వినుకొండ: మున్సిపల్ పోలింగ్ వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని శనివారం అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నరసరావుపేట తరలించారు. వినుకొండలోని బొల్లా బ్రహ్మనాయుడి నివాసంలో ఉన్న ఆయనను రూరల్ సీఐ బ్రహ్మయ్య, టౌన్ సీఐ బి. ప్రభాకర్‌తోపాటు నలుగురు ఎస్‌ఐలు బొల్లా ఇంటికి వెళ్లి హౌస్ అరెస్టు నోటీసులు అందజేశారు. వినుకొండలోనే తన నివాసం నుంచి బయటకు రానని, ఇక్కడు హౌస్ అరెస్టు చేయాలని అడిగినప్పటికీ వినుకొండలో శాంతిభద్రతల సమస్యలు ఉన్నాయని, నరసరావుపేటలోని ఇంటికి తరలిస్తామని పోలీసులు బొల్లాకు తెలియజేశారు. దీంతో ఆయన పోలీసుల తీరును తీవ్రంగా ఆక్షేపించారు. అవసరమైతే చావటానికై నా సిద్ధమేగానీ వెళ్లే ప్రసక్తే లేదని పోలీసులకు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు బొల్లాను బలవంతంగా ఎస్కార్ట్‌తో నరసరావుపేటలోని బొల్లా స్వగృహానికి తరలించారు. బొల్లా అక్రమ అరెస్టును పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.


