ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

సత్తెనపల్లి: జిల్లాలో చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లిలో నవంబర్‌ 1న మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికా శుక్లా అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా చెక్‌లిస్ట్‌ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి పూర్తిగా అందిందా? లేదా? అనేది జాగ్రత్తగా సరిచూసుకోవాలన్నారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది చేరుకోవాలన్నారు. పోలింగ్‌ సామగ్రి ప్రత్యేకించి బ్యాలెట్‌ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఆర్వోలు, స్పెషలా ఫీసర్లు దృష్టికి తీసుకురావాలన్నారు. ముఖ్యంగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అనంతర మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని నాలుగు మున్సి పాలిటీల్లో ఆదివారం పోలింగ్‌ జరగనుందని,ఇందు కోసం 308 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.వీటిలో క్రిటికల్‌గా ఉన్న 214 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌తో పాటు సీసీ కెమెరాలు లోపల ఒకటి, బయట ఒకటి ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఉదయం 6:15 గంటలకు మాక్‌ పోలింగ్‌ నిర్వ హించి 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్‌ సమయం నిర్దేశించటం జరిగిందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ నెల 3న కౌంటింగ్‌కు సైతం సిద్ధంగా ఉన్నామన్నారు. సత్తెనపల్లి ఆర్డీఓ కె.గోపాలకృష్ణ, సత్తెనపల్లి ఆర్వో దాసరి రాంబాబు, తహసీల్దార్‌ కెఎస్‌ చక్రవర్తి, అధికారులు ఉన్నారు.

స్వేచ్ఛగా ఓటు హక్కు

వినియోగించుకోవాలి...

నరసరావుపేట: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్‌ శనివారం వివరించారు. ఎన్నికల విధులు, కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించే సిబ్బందికి మూడు విడతలుగా ఇప్పటికే సమగ్ర శిక్షణ అందించినట్లు వెల్లడించారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల ద్వారా వెబ్‌కాస్టింగ్‌, లైవ్‌ టెలికాస్ట్‌ ఏర్పాటు చేశామని, నాలుగు ప్రాంతాల నుంచి నిరంతరం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేలా క్లోజ్‌ మానిటరింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఓటర్లందరికీ ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశామని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement