జాతీయ లోక్‌ అదాలత్‌లో 3,716 కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌లో 3,716 కేసులు పరిష్కారం

Sep 13 2026 7:40 AM | Updated on Sep 13 2026 7:40 AM

జాతీయ లోక్‌ అదాలత్‌లో 3,716 కేసులు పరిష్కారం రేపు పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ రద్దు

నరసరావుపేటటౌన్‌: జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం స్థానిక మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ అదాలత్‌లో సివిల్‌, క్రిమినల్‌, ముందస్తు వ్యాజ్యాలు, బ్యాంకు, కుటుంబ సంబంధిత లావాదేవీలు, మోటార్‌ వాహన ప్రమాద కేసులు తదితర అన్ని రకాల కేసులను పరిష్కరించారు. మొత్తం 3,716 కేసులు రాజీ ద్వారా పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో కక్షిదారులకు రూ. 3.38 లక్షల మేరకు ఆర్థికపరమైన లబ్ధి చేకూరింది. న్యాయాధికారులు బి.కిరణ్‌ కుమార్‌, జోత్స్నశ్రీలు రెండు బెంచ్‌లుగా ఏర్పడి కేసులను పరిష్కరించారు. ఈ అదాలత్‌లో న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.

నరసరావుపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం వినాయక చవితి పర్వదినం కారణంగా ప్రభుత్వ సెలవు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని కోరారు. ఎవరైనా తాము దాఖలు చేసిన అర్జీలు ఇంకా పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవాలనుకున్నా 1100 ఫోన్‌నంబర్‌కు కాల్‌ చేయవచ్చని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement