ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ? | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ?

Jul 31 2026 1:39 AM | Updated on Jul 31 2026 1:39 AM

● ఎన్నికల హామీలను నెరవేర్చాలి ● సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే ● కుటుంబాలు గడవక కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆవేదన ● చంద్రబాబు ప్రభుత్వంపై స్కీం ఉద్యోగుల కన్నెర్ర ● నేడు నరసరావుపేటలోని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా ● ప్రభుత్వ పాఠశాలల్లో నైట్‌ వాచ్‌మన్లకు నెలకు కేవలం రూ. 6 వేలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా గత ఏడు నెలలుగా బకాయి ఉంది. ● అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతామంటూ 2024 జూలైలో ప్రభుత్వ మినిట్స్‌లో రాసినప్పటికీ అమలు చేయడం లేదు. ఐదేళ్ల సీనియారిటీ ఉన్న అంగన్‌వాడీలకు మాత్రమే పదోన్నతి కల్పిస్తామనడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. నవచేతన తదితర యాప్‌లతో వారు అవస్థలు పడుతున్నారు. ● వైద్య సేవలు, ఫీవర్‌, ఫైలేరియా, టీబీ, నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) తదితర సర్వేల్లో నిత్యం ఒత్తిడికి గురవుతున్న ఆశ కార్యకర్తలపై స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమంతో అదనపు భారం మోపారు. ● సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనమివ్వాలి. కనీస వేతనం రూ. 26 వేలివ్వాలి. ● హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాలి. రెగ్యులరైజ్‌ చేయాలి. కానీ పక్షంలో మినిమం టైం స్కేల్‌ను వర్తింపజేయాలి. ● ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, పదవీ విరమణ ప్రయోజనాల కల్పన. ● ఉద్యోగ భద్రతతోపాటు పెన్షన్‌, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయాలను కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. ● డీఎస్సీ, ప్రభుత్వ రెగ్యులర్‌ పోస్టుల నియామకాల్లో వెయిటేజ్‌ కల్పించాలి. ● రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి. ● ఉద్యోగులు, సిబ్బందిపై రాజకీయ వేధింపులు అరికట్టాలి.

కనీస వేతనాలు అమలు చేయాలి

చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, పేకాట క్లబ్‌లు, మద్యం సిండికేట్లతో కూటమి నాయకులకు మాత్రమే చంద్రబాబు సంపద అందించారు. సామాన్య ప్రజలను నట్టేట ముంచారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, అందని సంక్షేమ పథకాలతో వారందరూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి అష్టకష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నారు.

సత్తెనపల్లి: జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నడుం బిగించారు. ఎన్నికల ముందు నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కూటమి ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా, తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమం ఒక్కటే శరణ్యమని పేర్కొంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా...

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో, ప్రభుత్వ స్కీం విభాగాల్లో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, పారామెడికల్‌, నర్సింగ్‌ ఉద్యోగులు, 108, 104 సిబ్బంది, శానిటరీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది 20 నుంచి 30 ఏళ్ల సీనియారిటీ కలిగి ఉన్నారు. ఎప్పటికై నా రెగ్యులర్‌ కాకపోతామన్న ఆశతో అప్పటి నుంచి చాలీచాలని వేతనంతో ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను లాక్కొస్తున్నారు. అయినప్పటికీ తమ తలరాతలు మారడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. ఎన్నిమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు పాలనలో సమస్యలివీ....

ప్రధాన డిమాండ్లు ఇవీ...

కనీస వేతనాలు అమలు కాక వివిధ శాఖల్లో పనిచేస్తున్న స్కీం ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ఆ మేరకు వేతనాలు పెరగక చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 31న కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నాం.

– ఎస్‌. ఆంజనేయులు నాయక్‌,

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement