నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో పోస్టు పెడితేనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. అంబటి ఇంటిపై దాడి చేస్తే కేసులు పెట్టలేదన్నారు. కారు యాక్సిడెంట్ కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై 307 కేసు పెట్టారని, గుంటూరులో మహిళను వివస్త్రను చేసిన టీడీపీ నేతపై సాధారణ కేసు నమోదు చేశారన్నారు. ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్నందుకు అంబటిపై దాడి చేసి కేసులు పెట్టారని, అన్నీ గుర్తుంచుకుంటామన్నారు.


