వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారని ఆరోపించారు. అంబటి ఇంటిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్తను అరెస్టు చేయాలన్నారు. మైనార్టీ నేత ముస్తఫాపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ రాక్షస పాలనలో వినుకొండ నియోజకవర్గంలో దారుణ హత్యలు చోటు చేసుకున్నాయని అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై నరికారని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మక్కెన హస్తం లేకుండా హత్యలు జరగవన్నారు.


