సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ నాయకుడి దుశ్శాసన పర్వం | - | Sakshi
Sakshi News home page

సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ నాయకుడి దుశ్శాసన పర్వం

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ నాయకుడి దుశ్శాసన పర్వం సాక్షి, నరసరావుపేట: గుంటూరులో ఓ మహిళను తెలుగుదేశం పార్టీ నాయకుడు వివస్త్రను చేయడం సభ్యసమాజం తలదించుకునే సంఘటన అని, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఇది నిదర్శనమని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ఆదివారం విడుదల చేసి ఒక ప్రకటనలో ఈ సంఘటన జరిగి మూడు రోజులైనా పోలీస్‌ శాఖ పట్టించుకోకపోవడం, రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి ఈ కేసు కట్టకుండా నిలువరించడంతోనే సరిపెట్టారన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాకనే చంద్రబాబు ప్రభుత్వం స్పందించిందన్నారు. మూడు రోజులు తరువాత స్పందించడమే కాకుండా దీనిని వైఎస్సార్‌సీపీ రాజకీయం చేస్తుందని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేషనల్‌ మీడియాలో ఈ వార్త రావడంతో రాష్ట్ర పరువు పోయిందన్నారు. రాష్ట్రంలో ఇదే కాకుండా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని మీడియా, సోషల్‌ మీడియా, పత్రికలు వారి చేతులో పెట్టుకొని బయటకు రాకుండా చేస్తున్నారన్నారు. ఇలాంటి అవమానకరమైన సంఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ సంఘటనతో మహిళాలోకం కన్నెర్ర చేయడంతో దిద్దుబాటు చర్యలలో భాగంగా మూడురోజుల తర్వాత కంటితుడుపు చర్యగా హడావుడిగా సీఐని వీఆర్‌కు పంపడం, టీడీపీ నాయకుడు రమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం చేశారన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించడంతోపాటు ఆ మహిళకు తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందన్నారు. రెండు వాహనాలు ఢీకొవడంతోనే ప్రమాదం రైలు కింద పడి మహిళ బలవన్మరణం

మహిళల భద్రతలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన సోనిబ్‌గా వెల్లడి

యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో రెండు బైక్‌లు ఢీకొన్ని ప్రమాదంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని బోయపాలెం గ్రామంలోని మసీదు వద్ద ఈనెల 17వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యడ్లపాడు పాత రెవెన్యూ కార్యాలయం వద్ద నివాసం ఉండే ఒంటిపులి శ్రీనివాసరావు(34) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం సుమారు రాత్రి 9.50 గంటలకు జరిగిందని, మసీదు సమీపంలోని వాటర్‌ ప్లాంట్‌ వద్ద వాటర్‌ డంబెల్‌ను స్కూటీపై తీసుకెళ్తున్న క్రమంలో అదే సమయంలో శ్రీనివాసరావు ఆ వైపు రావడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో శ్రీనివాసరావు రోడ్డుపై పడిపోవడంతో తలకు, కంటికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, 108 వాహనంలో కాటూరు మెడికల్‌ వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రికి చేరుకోగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య త్రివేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణాలు ఎస్‌ఐ టి శివరామకృష్ణ ఛేదించారు. బోయపాలేనికి వలస వచ్చిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం, ఉద్దమ్‌సింగ్‌నగర్‌ జిల్లాకు చెందిన సోనిబ్‌గా గుర్తించామన్నారు. గ్రామంలోనే సెలూన్‌షాపులో పనిచేస్తున్న అతన్ని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చీరాల రూరల్‌: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ జీవితంపై విరక్తి చెంది రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్‌ కొండయ్య ఆదివారం వివరాలు తెలిపారు. ఒంగోలు మరాఠీపాలేనికి చెందిన అనంత ఇందిరాదేవి (56) కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. మందులు వాడుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గకపోవడంతో ఇక వ్యాధి ఎప్పటికీ తగ్గదేమోనని భావించి జీవితంపై విరక్తి చెందింది. వేటపాలెం–చినగంజాం రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైన్‌లో గుర్తుతెలియని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement