జిల్లా సమస్యలపై ప్రస్తావన శూన్యం | - | Sakshi
Sakshi News home page

జిల్లా సమస్యలపై ప్రస్తావన శూన్యం

Jul 18 2026 3:29 AM | Updated on Jul 18 2026 3:29 AM

ముఖ్యమంత్రి సమక్షంలో మౌనం వహించిన టీడీపీ నేతలు

సభా ప్రాంగణంలో కనిపించని ఉప ముఖ్యమంత్రి ఫొటో

రుణ వితరణ సభకు విద్యార్థులను రప్పించిన వైనం

నిమ్మకాయల ధరలు

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2200, గరిష్ట ధర రూ.4000, మోడల్‌ ధర రూ.3200 వరకు పలికింది.

నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా స్థానిక కోడెల శివప్రసాదరావు క్రీడల స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన రుణ వితరణ సభలో జిల్లాలో నెలకొన్న సమస్యలకు స్థానం దక్కలేదు. సభలో మాట్లాడే అవకాశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబుకు దక్కినా ఎక్కడా సమస్యలు ప్రస్తావించలేదు. పరిష్కరించమని అడగలేదు. అలాగే సభ ఒక గంట ఆలస్యంగా ప్రారంభమైంది. షెడ్యూలు ప్రకారం 11.25కు సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభా ప్రాంగణానికి రావాలి. కానీ వారు 12.30కు వచ్చారు. సభా ప్రాంగణం 11గంటల సమయంలో కేవలం ముప్పావు వంతే జనాభాతో నిండింది. ఒకవైపు వరుస కుర్చీలు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. జనాభా రాలేదనే కారణంతోనో ఏమోగాని శ్రీ చైతన్య కళాళాల నుంచి విద్యార్థులను రప్పించారు. వారందరూ కళాశాల బస్సులు దిగి లైనులో చేరుకున్నారు. 2003 డీఎస్‌సీ ప్రదాత సీఎంకు ధన్యవాదాలు అంటూ గట్టిగా ఒక 20 మంది వ్యక్తులు బ్యానర్‌, సీఎం ఫొటోలు పట్టుకొని సీఎం ప్రవేశించేందుకు నిర్దేశించిన మెయిన్‌గేటు వద్ద నిల్చున్నారు. వాహనంలో వచ్చిన సీఎం వారివైపు కూడకుండానే వెళ్లిపోయారు. అలాగే ఫ్రీ బస్సు సీ్త్ర శక్తి పథకానికి ఉపయోగించే పల్లెవెలుగు బస్సులనే జనాభా తీసుకొచ్చేందుకు ఉపయోగించారు. పట్టణంలో సభ జరుగుతుండగా, పలు వార్డుల నుంచి డ్వాక్రా మహిళలు, టీడీపీ కార్యకర్తలను అక్కడకు తీసుకొచ్చేందుకు బస్సులను ఉపయోగించారు. కిలో మీటరు, లేదా కిలోమీటరున్నర దూరంలో ఉన్న సభా ప్రాంగణానికి కూడా బస్సులు ఉపయోగించటం గమనార్హం. దీంతో గురువారం సాయంత్రం నుంచే ఆర్‌టీసీ బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే కూటమిలో భాగస్వామ్యమైన జనసేన సారథి, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఫొటో ఎక్కడా సభాప్రాంగణంపై కన్పించలేదు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములమైన తమ విషయంలో ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటించలేదని జనసేన అభిమానులు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement