● ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీ,
డీఎస్పీ సహా అధికారులకు మెమోలు
● ‘సాక్షి’ కథనానికి స్పందన
తెనాలిరూరల్:తెనాలి పోలీసు లపై అక్రమ వసూళ్లు, అవినీతి దందాల ఆరోపణలు హెచ్చుమీరుతున్న నేపథ్యంలో పోలీ సు ఉన్నతాధికారులు చర్యల కు శ్రీకారం చుట్టారు. ‘పేరుకే పోలీసు.. చట్టం అంటే అలుసు’ పేరిట ఈ నెల 10వ తేదీన తెనాలిలో పోలీసుల వ్యవహారాన్ని కళ్లకుకట్టినట్టు చెబుతూ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పేకాట దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న అరోపణలతో వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఎం. రమేష్‌ను కాకుమాను స్టేషన్‌కు, తెనాలి రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ డి.రవిని ఫిరంగిపురం బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు, వన్ టౌన్ సీఐ సీహెచ్.రాంబాబు, రూరల్ ఎస్‌ఐ కె.ఆనంద్‌లకు చార్జ్ మెమోలు జారీ చేసిన ట్టు తెలిసింది. వేరే మహిళతో సహజీవనం చేస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇల్లు మార్చిన సీఐ ప్రస్తుతం ఎక్కడ అద్దెకు తీసుకున్నారన్న అంశాన్ని విచారిస్తున్నట్టు తెలిసింది.


