గుంటూరు ఎడ్యుకేషన్: నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం గుంటూరు లక్ష్మీపురంలోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జోన్ నుంచి అఖిల భారతస్థాయిలో అన్ని కేటగిరీల వారీగా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. సీహెచ్ మోహన నాగశ్రీ సాయి అఖిల్ 115వ ర్యాంకు, కె.సిద్ధార్థ 164వ ర్యాంకు, షేక్ నిహాల్ పర్వేజ్ 935వ ర్యాంకు, ఏ. నికేత్ రామ్ చౌదరి 1514వ ర్యాంకు, బి. శశిధర్ 1620వ ర్యాంకుతో పాటు ఐదువేల లోపు 46 మంది, 10వేల లోపు 89 ర్యాంకులతో పాటు 179 మంది విద్యార్థినీ, విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించనున్నారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంస్థ అకడమిక్ డైరెక్టర్ బొప్పన సుష్మ, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్, ఏజీఎం ఎల్‌టీసీ శ్రీనివాస్, ఆయా క్యాంపస్‌ల ప్రిన్సిపాల్స్ అభినందనలు తెలియజేశారు.


