ప్రయాణికులు సురక్షితం
రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని పెనుమూడి వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రేపల్లె డిపో నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం ప్రకారం.. పెనుమూడి సమీపంలోని పంట కాలువ పక్కన బస్సును డ్రైవర్ నిలిపి తాగునీటి కోసం దిగాడు. ఈ సమయంలో ఒక్కసారిగా బస్సు ముందుకు కదిలి పంట పొలంలోని కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 10 మంది ప్రయాణికులు ఉండగా, ఎవరికీ గాయాలు కాలేదు. స్థానికులు స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


