నాదెండ్ల: జాతీయ రహదారి నూతన బైపాస్ రోడ్డుకు ఇరువైపులా రెయిలింగ్ బిగించిన ఇనుప రాడ్లను దొంగిలిస్తున్న వ్యక్తిని హైవే పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన తాళ్లూరి జక్రయ్య దివ్యాంగుడు. ఒక కాలు లేకపోవటంతో మూడు చక్రాల బండిపై తిరుగుతుంటాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో జక్రయ్య నూతన బైపాస్ రోడ్డుపై గణపవరం వద్ద రోడ్డు వెంబడి రెయిలింగ్‌కు బిగించిన ఇనుప రాడ్లు దొంగిలించి పాత ఇనుప దుకాణంలో విక్రయిస్తున్నాడు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు గత పదిరోజులుగా సీసీ కెమేరాల ఫుటేజీ గమనించి సుమారు రూ.60 వేలు విలువైన ఇనుప రాడ్లు దొంగిలించి, విక్రయించినట్లు నేషనల్ హైవే పోలీసులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగిలించిన వస్తువులను ఎక్కడెక్కడ విక్రయించాడో ఆరా తీస్తున్నారు.
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు


