వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల
సమావేశంలో కలెక్టర్
నరసరావుపేట: జిల్లాలో సర్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా తెలిపారు. ఇప్పటివరకు 31,501 మంది అన్‌కలెక్టబుల్‌గా గుర్తించబడ్డారని చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో సర్‌పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 17,41,798 మంది ఓటర్లకుగాను ఇప్పటివరకు 13,19,818 ఫారాలు డిజిటలైజ్ చేశామన్నారు. 21,073 మంది మరణించిన ఓటర్లు, 4,430 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 5,409 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వారు, 556 మంది గైర్హాజరు, 33 ఇతర కేసులు గుర్తించారని తెలిపారు. మొత్తం జిల్లాలో మొత్తం 1,932 మంది బీఎల్‌ఓలు పనిచేస్తున్నట్లు చెప్పారు. గత 24 గంటల్లో 15,709 ఫారాలు డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. డీఆర్‌ఓ అద్దెయ్య పాల్గొన్నారు. ఓటర్లు ఈసీఐనెట్ మొబైల్ యాప్‌లోని బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌ఓ ఆప్షన్ ద్వారా లేదా ఓటర్స్.ఈసీఐ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఈ సేవను ఉపయోగించుకోవచ్చని సూచించారు. కాల్‌బుక్ చేసిన 48 గంటలలోపు సంబంధిత బీఎల్‌ఓ స్వయంగా ఓటరును సంప్రదించి, కావాల్సిన సమాచారాన్ని అందిస్తారని వివరించారు.


