అమరావతి: మండల కేంద్రమైన అమరావతి బండలచేను కాలనీలో చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయటంతో బాలిక తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బండచేను కాలనీలో నివాసం ఉంటున్న షేక్ నజీర్‌బాబు కుమార్తె నాలుగు సంవత్సరాల వయస్సు గల చాందినీబేగం శుక్రవారం సాయంత్రం ఆడుకోవటానికి వీధిలో రాగానే ఒక్కసారిగా వీధికుక్కలు దాడి చేశాయి. బాలిక ముఖంపైన, కంటి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, చికిత్స అందిస్తున్నారు. బాలిక చాందినీబేగం తండ్రి నజీర్‌బాబు మాట్లాడుతూ కొంతకాలంగా బండచేను కాలనీలో వీధికుక్కల బెడద అధికంగా ఉందన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రావటానికి భయపడుతున్నారని తెలిపారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మండల పరిషత్ కార్యాలయంలో కాలనీవాసులు అనేకమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


