వేటపాలెం: భార్య మెడకు వైర్ బిగించి ఽభర్త హత్య చేశాడు. ఈ ఘటన దేశాయిపేట పంచాయతీ రైల్వే ట్రాక్ అవతల కప్పలదిబ్బ కాలనీలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఎస్సై జనార్దన్ తెలిపిన వివరాల మేరకు.. కాలనీలో అన్నపురెడ్డి వీరమ్మ అలియాస్ షేక్ ఆశా భర్త షేక్ రఫీ నివాసం ఉంటున్నారు. వీరమ్మకు గతంలో వివాహం అయి ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తెకు వివాహం అయింది. వీరమ్మ భర్త గతంలోనే చనిపోయాడు. రామానగర్‌కి చెందిన షేక్ రఫీని రెండో పెళ్లి చేసుకుంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. షేక్ రఫీ ఆటో నడుపుతూ తరచూ మద్యం తాగొచ్చి భార్యపై అనుమానపడేవాడు. ఆమోతోపాటు కుమార్తె ఉమా వెంకటలక్ష్మి, కుమారుడు షేక్ షారూఖ్‌ను కూడా హింసించేవాడు. కుమార్తెను కూలీ పనులకు వెళ్లమని వేధిస్తుండటంతో భార్య అడ్డుకుంది. బుధవారం మధ్యాహ్నం తాగొచ్చి గొడవ పెట్టుకొన్నాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున గొడవ పడ్డాడు. చార్జింగ్ వైరును భార్య గొంతుకు చుట్టి హత్య చేశాడు. పిల్లలు కేకలు వేయగా చుట్టుపక్కల వారు రాగానే రఫీ పారిపోయాడు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని చీరాల రూరల్ సీఐ సుధాకర్ యాదవ్, క్లూస్ టీం పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.


