ఎదురెదురుగా రెండు లారీలు ఢీ ఒకరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా రెండు లారీలు ఢీ ఒకరికి గాయాలు

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

ఈపూరు: దున్నపోతును తప్పించబోయి ఎదురెదురుగా రెండు లారీలు ఢీ కొన్న సంఘటన మండల పరిధిలోని బోడెశంభునిపాలెం సమీపంలో గురువారం రాత్రి జరిగింది. ఘటనలో దున్నపోతు చనిపోగా, వ్యక్తికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వినుకొండ నుంచి గుంటూరుకు వెళ్తున్న లారీ రోడ్డుపై వెళ్తున్న దున్నపోతును తగిలి, అదే వేగంలో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొంది. ప్రమాదంలో దున్నపోతు చనిపోగా లారీ డ్రైవర్‌ తిరుమలశెట్టి నరేంద్రకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 ద్వారా వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఈపూరు పోలీసులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement