మాచర్ల: మాచర్ల పట్టణం, వెల్దుర్తి మండలాల్లోని పలు ప్రాంతాలలోని ఎరువుల షాపులలో సరఫరా విధానం పై జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు, మాచర్ల వ్యవసాయ సహాయ సంచాలకులు వి.జగదీశ్వర రెడ్డిలు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్క్‌ఫెడ్ ఆగ్రో సర్వీస్ సెంటర్, బాలాజీ ఫర్టిలైజర్‌ను, వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడులో అజయ్ ట్రేడర్స్‌లో సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు మాట్లాడుతూ మాచర్ల మండలంలో రోజుకి సుమారుగా 12,000 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూరియా అవసరం ఉన్న రైతులు 2 లేదా 3 రోజులు ముందే అవసరాన్ని బట్టి ఏపీఏఎంఐఎస్ యాప్ ద్వారా కొనుగోలు చెయ్యవచ్చన్నారు. డీలర్లు ఎంఆర్‌పి కన్నా ఎక్కువ కు అమ్మితే మండల వ్యవసాయ అధికారి, సహాయ వ్యవసాయ సంచాలకులు లేదా తన దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువులు డీలర్లు నిబంధనలకు లోబడి ఎరువుల వ్యాపారం చెయ్యాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని, షాపులైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. ఈ తనిఖీల్లో మాచర్ల, వెల్దుర్తి మండలాల వ్యవసాయ అధికారులు డి. పాప కుమారి, టి.బాలాజీ గంగాధర్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎం.మార్కండేయులు పాల్గొన్నారు.


