జిల్లాలో 74 శాతం డిజిటలైజేషన్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 74 శాతం డిజిటలైజేషన్‌

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

నరసరావుపేట: జిల్లాలో సర్‌ ప్రక్రియలో 74 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా గురువారం పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 17,41,798 మంది ఓటర్లు ఉండగా.. 99.99 మందికి ఈఎఫ్‌లు పంపిణీ చేశామన్నారు. 12,88,984 మంది ఫారాలు డిజిటలైజేషన్‌ చేశామన్నారు. కాగా, ఢిల్లీ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ హాజరయ్యారు. ఎన్నికల నియమావళి మార్గదర్శకాల మేరకు సర్‌ ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనర్హుల పేర్ల తొలగింపు, వివరాల సేకరణ, చిరునామా మార్పు అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement