మాచర్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలను పల్నాడు జిల్లాలో విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని డూ నియోజక వర్గాలలో ప్రజలు ఎక్కడికక్కడ బారులు తీరి సేవా కార్యక్రమాలతో పాటు పండుగ వాతావరణాన్ని సృష్టించి వైఎస్సార్‌కు నివాళులర్పించటం హర్షణీయమన్నారు. ప్రజల కోసం మహానేత చేసిన కృషితో పాటు, ఆయన చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నాటుకుపోయాయన్నారు. ఆయనను గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించటం జరిగిందన్నారు. అన్నీ ప్రాంతాలలో వైఎస్సార్ జయంతిని విజయవంతం చేసిన అన్నివర్గాల ప్రజలకు పీఆర్కే అభినందనలు తెలిపారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి


