రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు సత్తెనపల్లి వాసులు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు సత్తెనపల్లి వాసులు ఎంపిక

Jul 9 2026 6:23 AM | Updated on Jul 9 2026 6:23 AM

సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు సత్తెనపల్లి వాసులు ఎంపికయ్యారు. యోగ అసోసియేషన్‌ నేతృత్వంలో పల్నాడు జిల్లా నేషనల్‌ యోగా స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేట శ్రీసరస్వతి శిశు మందిర్‌లో నిర్వహించిన యోగా పోటీల్లో సత్తెనపల్లి యోగా సాధకులు ప్రతిభ కనబర్చి వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. సత్తెనపల్లికి చెందిన యోగా గురువు మారుతి రమేష్‌, లక్ష్మయ్య, వెంకటేశ్వరరావులు విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. విజేతలుగా 10–14 సంవత్సరాల విభాగంలో ఆర్యన్‌, ఆర్టిస్టిక్‌ సోలో ఈవెంట్‌ ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, ట్రెడిషనల్‌ ఈవెంట్‌లో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. 14–18 సంవత్సరాల విభాగంలో కె.చాతుర్య ట్రెడిషనల్‌ ఈవెంట్‌లో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, ఆర్టిస్టిక్‌ సోలో ఈవెంట్‌లో ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం కై వసం చేసుకున్నాడు. 35–45 సంవత్సరాల విభాగం మహిళల్లో జె.వసుంధర ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, కె.రమాదేవి ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం కై వసం చేసుకుంది. 35–45 సంవత్సరాల పురుషుల విభాగంలో ఎం.సునిల్‌కుమార్‌ ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, టి ఆంజనేయులు ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం కై వసం చేసుకున్నారు. 45–55 సంవత్సరాల విభాగంలో డి.సాంబశివరావు ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, పులి ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం, పులహరి బానోజి తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం కై వసం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement