బీసీ మహాధర్నాను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

బీసీ మహాధర్నాను జయప్రదం చేయండి

Jul 9 2026 6:23 AM | Updated on Jul 9 2026 6:23 AM

నరసరావుపేట: బీసీ వర్గీయుల డిమాండ్ల సాదన కోసం ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10న విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించే బీసీల మహా ధర్నా కార్యక్రమానికి బీసీలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను కోరారు. బుధవారం సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు జనాభా దామాషా మేరకు కల్పించాలని, సుప్రీంకోర్టు 50శాతం సీలింగ్‌ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేయించాలని, రాజ్యాంగ సవరణ ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని షెడ్యూల్‌ లైన్‌లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించాలని, బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏబీసీడీలుగా వర్గీకరించాలని, చట్టసభల మహిళ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, బీసీ రిజర్వేషన్లు ఖరారు తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని బీసీ కులాల వారు, ప్రజాస్వామికవాదులు, మహిళలు, ప్రజలందరూ మహాధర్నాలో పాల్గొన్న జయప్రదం చేయాలని కోరారు. పల్నాడు జిల్లా అధ్యక్షులు బిళ్ళకంటి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు నాగారపు గురు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు కొల్లిపర బాలాజీ, మండల ఉపాధ్యక్షులు వి.శ్రీరాములు, యువజన నాయకులు దమ్మాటి మల్లిఖార్జున పాల్గొన్నారు.

కోరిన బీసీ సంక్షేమసంఘ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement