మాచర్ల: మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలోని పరిష్కరించదగ్గ, రాజీపడదగ్గ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఈ నెల 11న శనివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్ కళ్యాణ్, పి.ప్రశాంత్‌లు పేర్కొన్నారు. మంగళవారం కోర్టు ప్రాంగణంలోని వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో సివిల్, క్రిమినల్, కుటుంబ వివాదాలు, బ్యాంకు కేసులు, వరకట్న వేధింపులు వంటివి రాజీ చేసుకునే అవకాశముందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజా కోర్టులో రాజీ పడదగ్గ కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయవాదులు రామా నాయక్, శ్రీనివాసరెడ్డి పలువురు న్యాయవాదులున్నారు.


