నరసరావుపేట: జిల్లాలో మంగళవారం నాటికి 65.11శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మొత్తం 17,41,798మంది ఓటర్లు ఉండగా 17,41,401మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామన్నారు. వారిలో 11,34,118మంది ఫారాలు డిజిటలైజేషన్ చేయటం జరిగిందన్నారు. నరసరావుపేట పట్టణంలోని షాలెంనగర్‌లో గల 11,12,13 వార్డుల్లోని 153, 154, 163 పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న సర్ ప్రక్రియను నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్‌డీఓ కె.బాలకృష్ణ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ బి.రమ్యకీర్తన మంగళవారం పరిశీలించారు. త్వరగా ఫారాలు సేకరించి డిజిటల్ చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు.


